వాలెంటరీ వ్యవస్థకు పవన్ వ్యతిరేకమా ?

ఈ మద్య ఏపీలో వాలెంటర్ల అంశం( Volunteers ) తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

వాలెంటర్ల కారణంగా సామాన్యులకు భద్రత లోపం ఉందని, ప్రజల వ్యక్తిగత డేటాను వాలెంటర్లు అమ్మేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఒక్కసారిగా వాలెంటర్ వ్యవస్థపై ఊహించని విధంగా కాంట్రవర్సీ నడుస్తోంది.ఈ వ్యవస్థపై మొదటి నుంచి కూడా కొంత మందిలో వ్యతిరేక అభిప్రాయమే ఉంది.

వాలెంటర్లను జగన్ తన స్వార్థం కోసం నియమించుకున్నాడని, వాళ్ళు వైసీపీ పార్టీ కార్యకర్తలే తప్పా.

ప్రభుత్వ తరుపు అధికారులు కాదని ఇలా రకరకాల విమర్శలు వినిపిస్తూ వచ్చాయి. """/" / ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం వాలెంటర్ల పని.

అయితే వైసీపీకి ఫేవర్ గా ఉండడం, ప్రజల్లో పార్టీని బలోపేతం చేయడం వంటి పనులు వాలెంటర్లు అంతర్లీనంగా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారితే వాలెంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

అయితే తాము అధికారంలోకి వస్తే వాలెంటరీ వ్యవస్థను అలాగే కొనసాగిస్తామని టీడీపీ( TDP ) ఇప్పటికే ప్రకటించింది.

కానీ జనసేన మాత్రం వాలెంటరీ వ్యవస్థపై కాస్త భిన్నాభిప్రాయంతో ఉంది.ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాలెంటరీ వ్యవస్థపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

"""/" / వాలెంటర్లతో జగన్ ( CM Jagan ) తప్పు చేయిస్తున్నాడని తీవ్రమైన విమర్శలు చేశారు పవన్.

ఇలా వాలంటరీ వ్యవస్థపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే.జనసేన అధికారంలోకి వస్తే వాలెంటరీ వ్యవస్థను రద్దు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

అయితే వాలెంటరీ వ్యవస్థపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికి ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఆ వ్యవస్థ విధులు నిర్వర్తిస్తోంది.

ఒకవేళ రద్దు అయ్యే విధంగా జనసేన అడుగులు వేస్తే.అది వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంక్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నా మాట.

మరి వాలెంటరీ వ్యవస్థపై పవన్ వైఖరి ఏంటి ? వచ్చే ఎన్నికల్లో ఈ వ్యవస్థపై జనసేన ఎలాంటి ఎజెండాతో ముందుకు సాగుతుంది అనేది చూడాలి.

రక్తహీనతను తరిమికొట్టే ఐరన్ రిచ్ లడ్డూ ఇది.. రోజుకొకటి తింటే మరెన్నో ఆరోగ్య లాభాలు!