Devara : దేవర సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి ఎన్టీయార్ అంత పని చేస్తున్నాడా..?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా( Devara Movie ) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఇప్పటికే ఎన్టీయార్( NTR ) వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన రీతిలో వరుసగా సూపర్ సక్సెస్ లను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న దేవర సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లో మరోసారి తన సత్తా చాటుకొని ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగాలని ఎన్టీఆర్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు.

"""/" / అయితే ఇప్పటికే తను త్రిబుల్ ఆర్( RRR ) సినిమాతో పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్నాడు.

అయినప్పటికీ ఇప్పుడు మాత్రం దేవర సినిమాతో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఎన్టీఆర్ ఇందులో ఫైట్స్ ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక డూప్ లేకుండా చాలా రిస్కీ షాట్స్ ను కూడా తెరకెక్కిస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే డూప్ ను వాడకుండానే ఎన్టీఆర్ ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడం పట్ల సినిమా యూనిట్ కొంతవరకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది.

"""/" / ఎందుకంటే తనకు ఏదైనా అయితే ఇప్పుడు తన అభిమానుల నుంచి కొరటాల శివ కి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

అందువల్లే డూప్ ను వాడదాం అని చెప్పిన కూడా ఎన్టీఆర్ మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని రియల్ గా ఉండాలనే ఉద్దేశ్యం తోనే డూప్ లేకుండా తనే స్వయంగా నటిస్తూన్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ విషయం లో ఎన్టీయార్ స్టార్ హీరోలందరికి ఆదర్శంగా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా పీక్స్ లో ఉన్నట్టు గా తెలుస్తుంది.