సమంత బాటలోనే నిహారిక పయనిస్తుందా… అందుకే ఇలా చేస్తుందా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత( Samantha ) బాటలోనే మెగా డాటర్ నిహారిక ( Niharika ) కూడా పయనిస్తుందని తెలుస్తుంది.
మెగా డాటర్ నిహారిక 2020 వ సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య( Venkata Chaitanya ) ను ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
వీరి వివాహం జరిగి కొంత కాలం పాటు సంతోషంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఇద్దరికీ అఫీషియల్ గా విడాకులు( Divorce ) కూడా వచ్చాయని కానీ ఈ విషయాన్ని మాత్రం మెగా ఫ్యామిలీ బయటకు చెప్పలేదని సమాచారం.
"""/" /
ఇక నిహారిక వ్యవహార శైలి చూస్తుంటే కూడా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.
అయితే నాగచైతన్యతో ( Nagachaitanya ) విడాకుల గురించి ప్రకటించడానికి ముందు సమంత ఎలాగైతే ప్రవర్తించిందో ప్రస్తుతం నిహారిక కూడా అలాగే వ్యవహరిస్తుందని పలువురు సమంతకు నిహారికకు మధ్య పోలికలు పెడుతున్నారు.
విడాకుల సమయంలో సమంత ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి తన స్నేహితుల(Friends) సహాయం తీసుకున్నారు.
తన స్నేహితులతో కలిసి పలు పర్యాటక ప్రదేశాలకు వెళ్లడమే కాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా వెళ్లి సమంత ఈ డిప్రెషన్ నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు.
"""/" /
ఈ క్రమంలోనే అచ్చం సమంత మాదిరిగానే నిహారిక కూడా విడాకుల డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం తన స్నేహితులతో కలిసి వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇలా నిహారిక ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి బాలి వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు సమంత లాగే నిహారిక కూడా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా తన భర్తకు దూరంగా ఉన్నటువంటి నిహారిక ప్రస్తుతం తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.
దీంతో వరుస సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
అలాగే నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.
సరిపోదా శనివారం టీజర్ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో న్యాచురల్ స్టార్ అదరగొట్టాడుగా!