తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే నాగార్జున 100 వ సినిమా చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున లాంటి స్టార్ హీరో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను సాధిస్తూన్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే ప్రస్తుతం నాగార్జున వందో సినిమా కోసం తీవ్రమైన కసరత్తులను చేస్తున్నట్లుగా తెలిసింది.

ఇక ఇది ఇలా ఉంటే 100 వ సినిమాను( 100th Movie ) ఎవరితో చేయాలనే కన్ఫ్యూజన్ లో ప్రస్తుతం నాగార్జున ( Nagarjuna )ఉన్నట్టుగా తెలుస్తుంది.

దీనికోసం చాలామంది దర్శకులు చెప్పే కథలను కూడా వింటున్నాడు.ఇక ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ కూడా ఈయనకు ఒక మంచి కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.

"""/" / అయితే విక్రమ్ కే కుమార్( Vikram K Kumar ) ప్రస్తుతం నితిన్ తో సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే నాగార్జునతో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయనకు ఒక డిఫరెంట్ కథను కూడా వినిపించారట.

ఆ కథకు నాగార్జున ఫిదా అయిపోయినప్పటికీ విక్రమ్ కుమార్ ప్రస్తుతం పెద్దగా సక్సెస్ లో లేడు కాబట్టి ఆయనతో సినిమా చేయాలా వద్దా అనే విషయాన్ని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఇది 100వ సినిమా కాబట్టి అది కచ్చితంగా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యం తో నాగార్జున ఈ సినిమా మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది.

అలాగే తన వందో సినిమాని సక్సెస్ సినిమాగా మార్చుకున్న వాడు అవుతాడు.కాబట్టి దాని కోసం ఆయన తీవ్ర కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఇంతకు ముందు నాగార్జున కి మనం లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ని ఇచ్చిన విక్రమ్ కుమార్ తో తన వందో సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.