ఆధునిక సమాజం కూడా అదుపు తప్పుతుందా…?
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా:ఆటవిక న్యాయం ఇంకా పురి విప్పి నాట్యం చేస్తుందా? అంటే యాదాద్రి భువనగిరి జిల్లా
రామన్నపేట మండలం( Ramannapeta ) మునిపంపుల గ్రామంలో కొందరు కుల పెద్ద మనుషులు ఇచ్చిన పెద రాయుడి తీర్పును చూస్తే
నిజమే అనిపిస్తుంది.
మానవ సమాజం శాస్త్ర సాంకేతిక యుగంలో రాకెట్ స్పీడ్ తో పురుగమిస్తున్న నేటి తరుణంలో కుల కట్టుబాట్ల పేరుతో ఓ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసి వేధింపులకు గురి చేయడంతో ఆ కుటుంబం చట్టాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై దంపతులు ఇద్దరూ పురుగుల మందు సేవించి
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది.
ఈ ఘటనతో అసలు మనిషి పురోగమనంలో ఉన్నాడా లేక తిరోగమనంలో పయనిస్తున్నాడా అర్దం కావడం లేదు.
ఇంతకీ ఈ సమాజం ఎటు పోతుంది?లోకం తీరు ఏమవనుంది?బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.
యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన కల్లూరి రమేష్, నరసింహ అన్నదమ్ములు
.
అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భూ వివాదం కుల పెద్ద మనుషుల వద్దకు చేరింది.
పెద్ద మనుషులు పంచాయితీ పరిష్కారం కోసం ఇద్దరి నుండి డిపాజిట్ పెట్టించిపంచాయితీ తీర్మానం చేశారు.
వారు చేసిన తీర్మానంలో తనకు న్యాయం జరగలేదని,తాను చట్ట ప్రకారం తేల్చుకుంటానని పెద్దల తీర్పును ఒప్పుకోలేదు.
ఆ చర్య సదరు పెద్దలకు కోపం తెప్పించింది.మేము చెప్పిన తీర్పునే ధిక్కరిస్తావా అంటూ రమేష్ కుటుంబాన్ని కులం నుండి బహిష్కరిస్తున్నట్లు పెద రాయుళ్ల లెవల్లో తీర్పు ఇచ్చారు.
అంతటితో ఆగకుండా కుల నుండి వెలేసిన రమేష్ కుటుంబంతో ఎవరైనా మాట్లాడినా, ఏదైనా సహాయం చేసినారూ.
5వేల జరిమానా విధిస్తామని బహిరంగ ప్రకటన చేసేశారు.ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే ఎందుకు మాట్లాడతారు కుల కట్టుబాట్లను ధిక్కరిస్తున్నారని వారిని బెదిరిస్తూ ఎవరిని మాట్లాడకుండా చేసి ఆ కుటుంబాన్ని ఒంటరి చేశారు.
దీనితో రమేష్ కుటుంబం గత నెలలోరామన్నపేట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.
ఈ సాంఘిక దురాచారాన్ని అరికట్టాల్సిన పోలీస్ శాఖవారిని పట్టించుకోలేదు.పైగా బహిష్కరించిన పెద్దల వద్దనే మాట్లాడుకోవాలని సర్దిచెప్పి పంపించారు.
నెల రోజుల నుండి గ్రామంలోని కులస్తులు ఎవరూ మాట్లాడాక,ఏ కార్యానికి పిలవక తీవ్ర అవమానానికి గురైన రమేష్,రేణుక దంపతులుమనస్తాపంతో నెల రోజులుగా కుల బహిష్కరణకు గురై మానసిక ఆందోళనకు లోనై మంగళవారం తెల్లవారుజామున తమ పొలం వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నంచేసుకున్నారు.
గమనించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న రమేష్, రేణుక దంపతులనురామన్నపేట ఏరియా హాస్పిటల్ కి తరలించగాపరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం హాస్పిటల్ లో దంపతులిద్దరూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.ఈ ఘటన వెలుగులోకి రావడంతోఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణ చేయడం ఏమిటని,ఏదైనా ఉంటే చట్ట పరిధిలో పరిష్కారం చేసుకోవాలని,ఇలాంటి అనాగరిక చర్యల వలనసమాజం ఆటవిక సమాజం వైపు అడుగులు వేస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్ద మనుషులు తమ పరిధి దాటి కుల కట్టుబాట్ల పేరుతో ఓ కుటుంబానికి వేధించి వారిమానసిక క్షోభకు కారణంకావడం శోచనీయం అని అసహనం వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ ఉన్నతాధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..