మారుతి నెక్స్ట్ సినిమాను ఆ హీరోతో చేయబోతున్నాడా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.ఎందుకంటే వాళ్లు మాత్రమే స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు.
నిజానికి ఒక సినిమా చేయాలంటే దర్శకుడు( Director ) ఒక కథను రాసుకొని హీరోను సెలెక్ట్ చేసుకొని ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్స్ సెట్ చేసి మొత్తానికైతే ఆ సినిమాను పట్టాలెక్కిస్తాడు.
ఇక అలాగే హీరో ఎలా యాక్టింగ్ చేయాలి.ఏ సీన్లో ఎలా మెప్పించాలి అనేది కూడా తను నటించి చూపిస్తాడు.
అయినప్పటికి ఈ దర్శకుడి కంటే హీరోకే ఎక్కువ గుర్తింపైతే వస్తుంది.మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న దర్శకులు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.
మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు మారుతి( Maruti ) లాంటి దర్శకుడు సైతం రాజాసాబ్ సినిమాతో( Rajasaab's Movie ) మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన చేసిన ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ అవుతుంది అంటూ పలు రకాల కామెంట్లు అయితే వస్తున్నాయి.
ఇక మారుతి రాజాసాబ్ సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
నిజానికి రాజాసాబ్ సినిమా సూపర్ సక్సెస్ అయితే చిరంజీవి( Chiranjeevi ) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
"""/" /
లేకపోతే మాత్రం చిరంజీవి మారుతిని పట్టించుకునే అవకాశాలు లేవు దానికి తోడుగా కూడా ఆయన మీడియం రేంజ్ హీరోలను సైతం లైన్ లో పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలతో తను సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్లు మారుతితో సినిమా చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
చూడాలి మరి మారుతి ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.