మహేష్ బాబు రాజమౌళి సినిమా కంటే ముందే మరో సినిమా చేయనున్నాడా..?
TeluguStop.com
రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబుని( Mahesh Babu ) హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా షూట్ ఉంటుంది అంటూ గత సంవత్సరం నుండి ప్రచారం అయితే సాగుతుంది.
ఇక దానికి సంబంధించిన పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నాడు.అలాగే మహేష్ బాబు కూడా తన గెటప్ ని మార్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రాజమౌళి ఎలాంటి స్ట్రాటజీని మెయిటైన్ చేయబోతున్నాడు అనే విషయాల మీద ఎవరికి సరైన అవగాహన అయితే లేదు.
"""/" /
అయితే ఈ సినిమాని స్టార్ట్ చేసిన మొదటి రోజే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను ఇవ్వాలనే ఉద్దేశ్యం తో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మహేష్ బాబుని ఒక అడ్వెంచర్ జానర్ లో( Adventure Genre ) చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఆయనకి కూడా ఇది కొత్త పాత్ర కావడంతో తనను తాను చాలా బాగా మార్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది మాత్రం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయడానికి కంటే ముందే మరొక సినిమా చేయడానికి కమిట్ అవుతున్నాడు అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
ఇక ఇప్పటికే 'గుంటూరు కారం'( Guntur Kaaram ) సినిమా రిలీజ్ అయి దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికి మహేష్ బాబు మాత్రం రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొనడం లేదు.
"""/" /
ఇంకా ఇప్పటివరకు రాజమౌళి షూటింగ్ ను స్టార్ట్ చేయలేదు.మరి ఈ సంవత్సరపు కాల వ్యవధిలో మహేష్ బాబు ఒక సినిమా చేసుకొని ఉండేవాడు కదా అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ముందుకు సాగే రాజమౌళి ఎట్టకేలకు మహేష్ బాబు సినిమాని సంక్రాంతి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన సింహం.. తర్వాతేమైందో చూడండి..