లోకేష్ టీడీపీకి బలమా.. బలహీనతనా ?

ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది.అయినప్పటికి మూడు ప్రధాన పార్టీలు పోలిటికల్ స్ట్రాటజీలతో ముందుకు కదులుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.అయితే వైసీపీ, జనసేన విషయాన్ని కాస్త పక్కన పెడితే.

వచ్చే ఎన్నికలు టీడీపీకి మాత్రం డూ ఆర్ డై లాంటివనే చెప్పుకోవచ్చు.గత ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత ఆ పార్టీలో అనిశ్చితి ఏర్పడింది.

పార్టీ కార్యకర్తల్లో కూడా మునుపటి జోష్ కనుమరుగైంది.మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వయసు రీత్యా వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆశ్చర్యం లేదు.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఉనికిని కాపాడుకోవాలన్నా వచ్చే ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

అందుకు తగ్గట్టుగానే టీడీపీ కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఏడు పదుల వయసులో కూడా అధినేత చంద్రబాబు ప్రజల్లో ఉంటూ తెలుగుతముళ్లలో జోష్ పెంచుతున్నారు.

మరోవైపు తనయుడు నారా లోకేష్ కూడా " యువ గళం " పాదయాత్ర తో ప్రజా దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నారు.

అయితే చంద్రబాబు విషయాన్నీ అలా ఉంచితే రాష్ట్రంలో లోకేష్ గురించిన చర్చే ఆధికంగా జరుగుతోంది.

వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించడంతో.తదుపరి టీడీపీ సారధిగా లోకేష్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

"""/"/ అయితే లోకేష్ కు టీడీపీని నడిపించే సమర్థత ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టమే.

బలమైన వాక్చాతుర్యం లేకపోవడం, ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కొలేకపోవడం వంటి కారణాలతో ప్రత్యర్థి పార్టీలు లోకేష్ ను లైట్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు.

ఇప్పటికే వైసీపీ నేతలు లోకేష్ పై ఎన్ని రకాల విమర్శలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం.

అయితే గతంలో పోలిస్తే లోకేష్ లో చాలానే మార్పు వచ్చిందని తెలుగు తమ్ముళ్ళ నుంచి వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం తన బాడీ షెమింగ్ లోనూ, భాష విధానంలోనూ గతంలో పోలిస్తే చాలానే వ్యత్యాసం చూపిస్తున్నారు లోకేష్.

విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, ప్రత్యర్థులపై పదునైన వ్యాఖ్యలు చేయడంలో కూడా లోకేష్ రాటూదేళుతున్నారనే చెప్పవచ్చు.

ఇలా లోకేష్ చేపట్టిన పాదయాత్రపైన మొదట్లో ప్రత్యర్థి పార్టీ నుంచి విమర్శలు, వ్యంగ్యస్త్రాలు వచ్చినప్పటికి, ప్రస్తుతం ఆయన పాదయాత్ర చెప్పుకోదగ్గ రీతిలోనే సాగుతోంది.

అంతే కాకుండా పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటైన విమర్శలు చేస్తుండడంతో.లోకేష్ లోని మార్పు చూసి టీడీపీ నేతలు కూడా సంతృప్తిగానే ఉన్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో లేకేష్ చేసే వ్యాఖ్యలు తీవ్ర ట్రోలింగ్ కు గురైవుతున్నాయి.

ఇదే టీడీపీని కలవర పెడుతున్న అంశం.ట్రోల్స్ వల్ల లోకేష్ పాదయాత్ర యొక్క ప్రదాన్యత తగ్గుతుందనేది కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.

ఏది ఏమైనప్పటికి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న లోకేష్.టీడీపీకి బలం అవుతారో లేదా బలహీనత అవుతారో చూడాలి.

కెనడాలో రెచ్చిపోయిన దుండగులు.. హిందూ ఆలయంపై చెత్త రాతలు, భారత్ ఆగ్రహం