నాయకత్వ లోపమే తెలంగాణ కాంగ్రెస్ కు శాపమా?

దేశ రాజకీయాల్లో ఒకప్పుడు దశాబ్దాల పాటు చక్రం తిప్పన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్( Congress ) గత కొన్ని సంవత్సరాలుగా పునర్ వైభవం కోసం పాకులాడుతుంది .

ముఖ్యంగా మోడీ లాంటి చరిష్మాటిక్ నాయకుడి అండతో భాజపా దేశవ్యాప్తంగా బలంగా పాతుకుపోయింది.

అలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే సమవుజ్జి అయిన నాయకుడు కావాలి.కానీ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఆ స్థాయి నాయకుడుగా నిలబడలేక పోతున్నాడు.

గత కొంతకాలంగా తన భారత్ జోడో యాత్రలతో( Bharath Jodo Yatra ) కొన్ని వర్గాలను ఆకట్టుకున్నప్పటికీ మోడీకి సమాన స్థాయిలో నిలబడటం లో మాత్రం రాహుల్ ఇంకా ఒక అడుగు వెనకే ఉన్నాడని చెప్పవచ్చు.

మరోపక్క రాష్ట్రాల ఎన్నికలలో కూడా బలమైన నాయకుల కొరత కాంగ్రెస్ను వేధిస్తుంది .

ముఖ్యంగా వైఎస్సార్ లాంటి డైనమిక్ లీడర్లు లేకపోవడం కాంగ్రెస్కు ఇబ్బందిగా మారింది.ఇప్పుడు అధికారంలోకి వస్తుందని అంచనాలున్న తెలంగాణలో కూడా ఇప్పుడు వైయస్ లాంటి మాస్ లీడర్ లేకపోవడం కాంగ్రెస్కు ప్రధాన అడ్డంకి గా మారింది.

"""/" / బారాస కు అన్నీ తానే అయ్యి చక్రం తిప్పుతున్న కేసిఆర్( KCR ) కి సమఉజ్జిగా రేవంత్ నిలబడలేకపోతున్నారు.

ముఖ్యంగా తెలుగుదేశం నుంచి వలస వచ్చిన నాయకుడు కావడం, ఓటుకు నోటు కేసులో బహిరంగంగా పట్టుబడి ఉండటం వంటివి ఆయనకు ప్రతిబంధంగా మారాయి.

అయితే కేసీఆర్ వ్యతిరేకులకు ఒక వేదిక నిర్మించడంలోనూ, రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్కు పూర్తి స్తాయిలో అనుకూలంగా మలచడం లోనూ రేవంత్ కొంత విజయవంతమైనప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్లోని అంతర్గత పోరును సరిదిద్దడం లో మాత్రం వెనకబడ్డాడని చెప్పాలి.

కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నాయకత్వానికి తగిన మర్యాద ఇవ్వకపోవడం అనేక సందర్భాలలో బయటపడింది.

పైగా టికెట్లు కేటాయింపులలో కూడా పూర్తిస్థాయి బాధ్యతలను రేవంత్ రెడ్డి పై పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా సిద్దం గా లేకపోవడం వల్లే కొంతమంది సీనియర్లకు కూడా అధిష్టానం రేవంత్ తో సమానం గా బాధ్యతలను పంచడం తో వీరి మద్య సమన్వయ లోపం కూడా కనిపిస్తుంది.

నిజానికి అధికార పార్టీపై అవినీతి ఆరోపణలను ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలను అంశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే కాంగ్రెస్ తిరుగే ఉండదు.

అయితే అందివస్తున్న అవకాశాలను కాంగ్రెస్ పూర్తిస్థాయిలో విజయవంతం అవడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి .

మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఏ విధంగా అంతర్గత పరిస్థితులు చక్కదిద్దుకుంటుంది అన్న దానిని బట్టి కాంగ్రెస్ విజయం ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .

వైరల్ వీడియో: బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఒక్కసారిగా బైకుపై వెళ్తున్న ఆ దంపతులు..?