కామారెడ్డి లో కేసీఆర్ గెలుపు అంత ఈజీ కాదా ? 

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) గజ్వేల్ నియోజకవర్గంతో పాటు , కామారెడ్డి లోను పోటీ చేస్తున్నారు.

  కేసిఆర్ కు పోటీగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి,  బిజెపి నుంచి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి పోటీ చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో,  హారహోరి పోరు నెలకొంది .

ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఎవరిది గెలుపు అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  అయితే రేవంత్ రెడ్డి కంటే బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి( Katipally Venkataramanareddy ) నుంచే గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలు మొదలయ్యాయి .

దీనికి కారణం స్థానికుడైన వెంకటరమణారెడ్డికి ఈ నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది.దీనికి తోడు అనేక ప్రజా ఉద్యమాలలో ఆయన పాల్గొంటూ నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు పొందడంతో కెసిఆర్ కు ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది .

"""/" /  అయితే అటు కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఇటు బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అది తమకు లాభం చేకూరుస్తుందనే అంచనాలో బీఆర్ఎస్ ఉంది.

అయితే గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాన్ని కేసీఆర్ ఎంచుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

  కేసీఆర్ తల్లి పుట్టిన ఊరు కావడంతో ఈ నియోజకవర్గంలో బంధుగణం ఎక్కువగానే ఉంది.

ఎన్నికల షెడ్యూల్ రాకముందే భారీగా అభివృద్ధి పనులకు నిధులను కేసీఆర్ కేటాయించారు.బిజెపి( BJP) నుంచి పోటీ చేస్తున్న జడ్పీ మాజీ చైర్మన్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఈ నియోజకవర్గంలో గత నాలుగైదు ఏళ్లుగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేపడుతూ,  దానికి నాయకత్వం వహిస్తున్నారు .

డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో రైతులకు భారీ నష్టం జరుగుతోందని ఆందోళన చేపట్టిన రైతుల కోసం ఈయన అండగా నిలబడి ఉద్యమానికి నాయకత్వం వహించడం,  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం , ఇలా అనేక ప్రజా ఉద్యమాలతో జనంలో మంచి పేరు ప్రఖ్యాతలు వెంకటరమణారెడ్డి సంపాదించుకున్నారు .

"""/" / తనకు స్థానికుల ఓట్లు భారీగా పడతాయని తాను తప్పకుండా గెలుస్తాననే ధీమాతో వెంకటరమణారెడ్డి ఉన్నారు.

ఈ మేరకు 150 కోట్లతో సొంత మ్యానిఫెస్టోను అమలు చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు.

దీంతో అటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కంటే బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి నుంచి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో, కేసీఆర్ గెలుపు పై కాస్త టెన్షన్ పడుతున్నారట.

అమీర్ ఖాన్ కొత్త సినిమా వచ్చేది అప్పుడేనా..?మన హీరోలను చూసి భయపడుతున్నాడా..?