ప్రధానితో భేటీ కోసమే కేసీఆర్ ఢిల్లీ టూర్ ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మాత్తుగా ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నారు.నిన్న సాయంత్రం కొంతమంది మంత్రులు, ఎంపీలతో ఢిల్లీకి వెళ్లారు.

ఆయన ఆకస్మిక పర్యటన వెనుక ఉన్న రాజకీయం ఏంటి అనే దానిపై ఎవరికి సమాచారం లేదు.

అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక చాలా పెద్ద రాజకీయ తంత్రమే ఉందనే ప్రచారం జరుగుతోంది.

చాలా కాలంగా కేసీఆర్ తెలంగాణ బిజెపి నాయకులతో పాటు , కేంద్ర బిజెపి పెద్దలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

కేంద్రం కూడా అంతే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పై టార్గెట్ పెట్టడంతో టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లుగా రాజకీయ యుద్ధం తీవ్రతరం అయింది.

నరేంద్ర మోది పైన కేసీఆర్ వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు.ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటిని ఏకం చేస్తూ , రాబోయే ఎన్నికల్లో బిజెపిని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.

అదే కాకుండా కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సైతం విపక్షాల ముఖ్యమంత్రులు సమావేశాలను పూర్తిగా తగ్గించేశారు.

  """/"/ ఇక కే సిఆర్ ప్రభుత్వం చేసే విమర్శలకు బీజేపీ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నా, తమను ఈ స్థాయిలో టార్గెట్ చేసుకోవడంపై బిజెపి పెద్దలు ఆగ్రహంగానే ఉన్నారు .

ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా ఢిల్లీ టూర్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఈ వ్యవహారాలేనని, ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తో ప్రత్యేక సమావేశం కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ సందర్భంగా అనేక అంశాలపై ప్రధానితో కెసిఆర్ చర్చించే అవకాశం ఉన్నట్లు టిఆర్ఎస్ లోని కొంతమంది కీలక నాయకులు  వ్యాఖ్యనిస్తున్నారు.

టిఆర్ఎస్ ,బిజెపి మధ్య పోరు హారహోరిగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రధానితో భేటీ అయితే రాజీపడేందుకే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతాయని భయము టిఆర్ఎస్ లో ఉంది.

ప్రధానితో భేటీ అనంతరం విపక్ష పార్టీల అధినేతలను కలిసి అవకాశం ఉన్నట్లు సమాచారం.

స్పోర్ట్స్ టీషర్ట్ లో కనిపించిన మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!