బీజేపీపై వ్యూహాత్మక ఎత్తుగడ విషయంలో కెసీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నారా?
TeluguStop.com
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో హాట్ హాట్ గా మారాయి.
ప్రస్తుతం బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో బీజేపీని అడ్డుకోవడం ఇప్పుడు కేసీఆర్ కు అతిపెద్ద సవాల్ గా మారుతున్న పరిస్థితి ఉంది.
ప్రస్తుతం చాలా వరకు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెంచాలనే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇటు బీజేపీ ఇపుడిప్పుడే బలపడుతున్న తరుణంలో అధికారం చేపడుతుందా అంటే కొంత ప్రశ్నార్థకమనే చెప్పాలి.
ఎందుకంటే తెలంగాణలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాలలో బీజేపీకి ఒకటో వంతు నియోజకవర్గాలలో మాత్రమే బాలమైన కార్యకర్తల నిర్మాణం ఉంది.
మిగతా నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ అంటే కూడా తెలియని పరిస్థితి ఉంది.అయితే రాష్ట్ర వ్యాప్తంగా బలపడి అధికారం చేపట్టే దిశగా ఎదగాలంటే ఇంకో పది సంవత్సరాల సమయం పడుతుంది.
అయితే దేశ వ్యాప్తంగా మోడీ హవా వచ్చినప్పుడు ఎలాగైతే బీజేపీ పార్టీ బలంగా లేని నియోజకవర్గాలలో కూడా దేశ వ్యాప్తంగా ఎలాగైతే బీజేపీ విజయం సాధించిందో ప్రస్తుతం అలాంటి వాతావరణమే కనుక తెలంగాణలో ఏర్పడితే బీజేపీ ఎక్కువ స్థానాలకు సాధించడానికి అవకాశం ఉంటుందనే వ్యూహంలో భాగంగానే పెద్ద ఎత్తున బీజేపీ పట్ల చర్చ జరిగేలా రకరకాల కార్యాచరణను చేపడుతున్న పరిస్థితి ఉంది.
"""/" /
అయితే బీజేపీ పార్టీ ని ఎదుర్కొనే విషయంలో చాలా వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులేస్తున్న పరిస్థితి ఉంది.
దీంతో సరైన సమయంలో సరైన విధానంగా బీజేపీకి సమాధానం ఇచ్చేలా కేసీఆర్ తెర వెనుక సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా బీజేపీని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటాడనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రియల్ డాకు మహారాజ్ స్టోరీ మీకు తెలుసా.. వామ్మో ఏకంగా అన్ని హత్యలు చేశాడా?