కేసీఆర్ ముళ్లబాటా వేసుకున్నాడా ... ఆ తప్పు ఎందుకు చేసాడు
TeluguStop.com
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అధికార పీఠం ఎక్కి పార్టీ జెండా రెపరెపలాడించాలంటే ప్రతి సీటు, ప్రతి ఓటు ఎంతో కీలకం అవుతుంది.
అందుకే పార్టీలు సీట్ల కేటాయింపులో ఆచి తూచి మరి వ్యవహరిస్తుంటాయి.ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించి కచ్చితంగా గెలుపు గుర్రాలు అనుకున్నవారికే సీట్లు కేటాయిస్తూ .
తమ విజయానికి బాటలు వేసుకుంటాయి.అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పులో కలిసినట్టు కనిపిస్తోంది.
ఎన్నికలకు వెళ్లిపోవాలనే కంగారు తప్ప ఆయన మిగతా విషయాలు వీటి గురించి పెద్దగా ఆలోచించినట్టు కనిపించలేదు.
అందుకే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడేలా కనిపిస్తోంది.ఆయన తాజాగా ప్రకటించిన 105 మంది లిస్ట్ లో ఎక్కువశాతం సిట్టింగ్ ఎమ్యెల్యేలే ఉన్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కేసీఆర్ ప్రకటించిన జాబితా చూసి టీఆర్ఎస్ వర్గాలు ఆశ్చర్యపోతుండగా.
కాంగ్రెస్ పార్టీలో ఆనందం కనిపిస్తోంది.ఎందుకంటే.
కేసీఆర్ ప్రకటించిన సిమిట్టింగ్ ఎమ్యెల్యేల్లో ఎక్కువ శాతం మంది అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నవారే కన్పిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ తప్పు చేశారు అనే వాదన ఒకవైపు ఉండగానే పార్టీ తరపున ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్ట్ చూసి ఆ పార్టీ నేతలకే మింగుడు పడడంలేదు.
ఎందుకంటే.చాలామంది సిట్టింగులు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.
పార్టీ క్యాడర్, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.కేసీఆర్ అంతర్గతంగా నిర్వహించిన అనేక సర్వేల్లోనూ వారికి పెద్దగా మార్కులు కూడా రాలేదు.
ఈ క్రమంలో ఇక ఈసారి వీళ్లకు కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో టికెట్లు ఇవ్వరని గట్టిగా వాదన వినిపించింది.
కానీ.వారందరికీ కేసీఆర్ టికెట్లు ప్రకటించడంతో అంతా షాక్ తిన్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కేసీఆర్ ప్రకటించిన లిస్ట్ లో ఉన్న సిట్టింగ్ ల పరిస్థితి ఒకసారి చూస్తే.
భూ వివాదాలు, కలెక్టర్‌తో అనుచిత ప్రవర్తన, క్యాడర్‌లో వ్యతిరేకత ఉన్నఉమ్మడి వరంగల్ జిల్లా మానుకోట తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కేసీఆర్ టికెట్ ప్రకటించగానే ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆనందం కనిపించిందట.
ఎందుకంటే ఆయన ఓటమి దాదాపు ఖాయమనే అభిప్రాయం టీఆర్ఎస్ క్యాడర్లోనే ఉంది.జనగామ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిస్థితి కూడా ఇంతే.
ఆయన చుట్టూ అనేక భూ వివాదాలు ఉన్నాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పై కూడా క్యాడర్‌లో, ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
ఆయనకు కూడా టికెట్ వచ్చింది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కష్ణారావుపై కూడా భూ వివాదాలు ఉన్నాయి.
అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డిపై కూడా అనేక వివాదాలు ఉన్నాయి.
ఇదే జిల్లాకు చెందిన నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిస్థితి కూడా ఇదే.
ఇటువంటి వారు అనేకమంది టీఆర్ఎస్ లో మళ్ళీ సీటు సంపాదించారు.వీరి మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్టీకి నష్టం చేకూర్చక మానదు.
వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!