కంగనా కూడా పెళ్లిపీటలు ఎక్కబోతుందా.. వరుడు ఎవరో తెలుసా?
TeluguStop.com
కంగనా రనౌత్ ( Kangana Ranaut ).ఈ పేరు తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.
ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది.బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈమె సుపరిచితమే.
ఈమె నటన పరంగా ఎవ్వరు వేలెత్తి చూపించేలేరు.అయితే బయట మాత్రం అన్ని విషయాల్లో కల్పించుకుని ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
"""/" /
అందుకే ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది.టాప్ హీరోలను సైతం తన కామెంట్స్ తోనే ముచ్చెమటలు పట్టించగల సత్తా ఉంది.
ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వరుస హిట్స్ కొట్టి టాప్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
అయితే ఈ భామకు ఈ మధ్య వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.ఇటీవల కాలంలో ఈమె చేసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.
"""/" /
ఇదిలా ఉండగా ఈ రోజు చంద్రముఖి 2( Chandramukhi 2 ) సినిమాతో కంగనా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ భామ మళ్ళీ తనదైన నటనతో చంద్రముఖి రోల్ లో అందరికి భయపెట్టింది.
లారెన్స్ రాఘవ, కంగనా నటించిన చంద్రముఖి 2 పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
మరి ఈ వీకెండ్ గడిస్తే ఈ సినిమా హిట్టో ప్లాప్ నో తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ భామ పెళ్లి వార్తలు తాజాగా వైరల్ అవుతున్నాయి.ఈ మధ్య బాలీవుడ్( Bollywood ) ముద్దుగుమ్మలంతా వరుసగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు.
మరి కంగనా కూడా అతి త్వరలోనే పెళ్లి చేసుకోనుందని టాక్ వైరల్ అవుతుంది.
ఈ బ్యూటీకి ఇప్పుడు 36 ఏళ్ళు.అందుకే ఈ సీనియర్ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది.
ఈమె ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని బాలీవుడ్ మీడియా చెబుతుంది.
చూడాలి ఈ భామ ఎప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతుందో.
No-Deposit Bonuses: Where To Get Free Spins — Insider Tips For High Rollers (CA)