కళ్యాణ్ రామ్ బింబిసార 2 తో రిస్క్ చేస్తున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్.
( Nandamuri Kalyan Ram ) ఆయనకి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది.
ప్రస్తుతం ఆయన ఎన్ కే ఆర్ 21 పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా మీదనే ప్రస్తుతం ఆయన భారీ ఆశలు అయితే పెట్టుకున్నాడు.
ఇక దాంతో పాటుగా ఆయన బింబిసార 2 ( Bimbisara 2 ) సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు.
"""/" /
అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రతి సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.
ఆయన చేసిన ప్రతి సినిమాలోని ఏదో ఒక ఎలిమెంట్ తో కొత్తగా ఉండటం అనేది మనం చూస్తూనే వస్తున్నాం.
అయితే ఆయన సినిమాల్లో చాలా వైవిధ్యమైన కథంశాలైతే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక 'బింబిసారా 2' సినిమాని ఆయన మొదట వశిష్ట తో( Vassishta ) చేయాలని అనుకున్నాడు.
కానీ ప్రస్తుతం ఆయనకి ఉన్న కమిట్మెంట్లకి ఈ సినిమా చేయడం విలు కాకపోవడంతో కళ్యాణ్ రామ్ వేరే దర్శకుడిని పెట్టి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
"""/" /
ఇక అందులో భాగంగానే ఆయన ప్రొడ్యూసర్ గా చేసిన 'దేవర' సినిమా( Devara ) రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది.
దాంతో భారీ లాభాలను మూటగట్టుకున్న ఆయన మరిన్ని సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందుకే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా మందికి బూస్టప్ ని ఇస్తుంది.
ఫెయిల్యూర్ మాత్రం చాలా మందిని డిప్రెషన్ లోకి తీసుకెళ్తుందనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ హీరోగా సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.