ఇండస్ట్రీ లో ఉన్న మరి కొంత మందికి కూడా జానీ మాస్టర్ పరిస్థితే రాబోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చాలా రోజుల నుంచి చాలా రకాల కామెంట్లైతే ఎదురవుతున్నాయి.

ఇక రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు కొరియోగ్రాఫర్లు చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా జానీ మాస్టర్ ( Jani Master )సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వడమే కాకుండా కొంతమంది కూడా ఇండస్ట్రీలో ఉన్నవారు తమను మోసం చేశారు అంటూ బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.

"""/" / ఇక ఇప్పటికే దర్శకులా మీద చాలా రకాల ఆరోపనలైతే వస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన పూనమ్ కౌర్ ( Poonam Kaur)మాత్రం కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేస్తుంది.

ఇక ఆమె ఎప్పుడూ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ను టార్గెట్ చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడుతుంది.

మరి ఎందుకు త్రివిక్రమ్ మీదనే ఆమె ఫోకస్ పెడుతుంది అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు.

కానీ ఆమె ట్వీట్ చేసిన ప్రతిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఇన్ డైరెక్ట్ గా ఉద్దేశించే మాట్లాడుతుండడం విశేషం.

"""/" / ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి మరి కొంత మంది అమ్మాయిలు కూడా కొందరి బారిన పడ్డారని వాళ్లు కూడా బయటికి వచ్చి తమకు న్యాయం జరగాలని పోరాటం చేయబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి.

మరి ఇప్పటి వరకైతే ఇండస్ట్రీలో వచ్చిన న్యూస్ లు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.ఇక మీదట మరి కొన్ని న్యూస్ లు వచ్చి ప్రేక్షకులలో ఇండస్ట్రీ మీద ఉన్న నమ్మకాన్ని తొలగిస్తాయా అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం ఆందోళన పడుతున్నారు.

ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావడానికి కూడా చాలా మంది అమ్మాయిలు భయపడే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు అంటూ మరి కొంతమంది మేకర్స్ అయితే కామెంట్లు చేయడం విశేషం.

ఆ ఓటీటీలో రతన్ టాటా డాక్యుమెంటరీ.. నానో కారు వెనుక అసలు కథ ఇదే!