తెలంగాణలో ఇక యాక్టివ్ ఎంట్రీకి జనసేనాని సిద్దమవుతున్నారా?
TeluguStop.com
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రణరంగంగా మారుతున్నాయి.ప్రజల నుండి ప్రతిపక్ష పార్టీలకు మద్దతు దొరుకుతున్న పరిస్థితులలో ఉదాహరణకు బీజేపీని తీసుకుంటే రెండో దఫా ఎన్నికల సమయానికి తెలంగాణలో బీజేపీకి అంత పట్టు లేదు.
కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే అప్పటి పరిస్థితికి పూర్తి భిన్నంగా మారింది.అందుకే ఇతర పార్టీలు కూడా తెలంగాణలో రాజకీయంగా పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అయితే తెలంగాణలో కూడా తమ శాఖలు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాలలో అంతగా యాక్టివ్ గా లేదు.
అయితే త్వరలో తెలంగాణలో కూడా యాక్టివ్ గా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలకు పదునుపెడుతున్నట్టు సమాచారం.
వై.ఎస్.
షర్మిల కూడా తెలంగాణలో త్వరలో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే తెలంగాణలో ఉన్న జనసేన శాఖలను కూడా రాజకీయంగా యాక్టివ్ చేస్తే తెలంగాణ రాజకీయాలు ఇక హోరాహోరీగా మారనున్నాయి.
ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినా, భవిష్యత్తులో జనసేన అధినేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాడా లేక ప్రభుత్వానికి మద్దతు పలుకుతాడో అనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది.