జగన్ కుల చిచ్చు పెడుతున్నారా ?

వైఎస్ జగన్( YS Jagan ) వచ్చే ఎన్నికల దృష్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్న ఆయన లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నీ వర్గాల ప్రజలకు దగ్గరవ్వడమే ముఖ్యం అని భావిస్తున్నారా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

ముఖ్యంగా కుల, సామాజిక వర్గ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ స్ట్రాటజీలను అమలు చేయాలని చూస్తున్నరు.

కుల వివక్షపై( Caste Discrimination ) గతంలో ప్రతిపక్ష నేతలు ప్రస్తావించిన మాటలను ప్రధానంగా లేవనెత్తుతూ ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు వైఎస్ జగన్.

తాజాగా జరిగిన సభలో ఆయన కులల ప్రస్తావన తీసుకొచ్చి కొత్త చర్చకు తవిచ్చారు.

ఎస్సీ ( SC ) కులల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటరా ? అని గతంలో ప్రతిపక్ష అధినేత వ్యాఖ్యానించారని, అలాగే బీసీల ( BC ) తోకలు కత్తిరిస్తా అంటూ గతంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.

కుల వివక్ష లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా అన్నీ వర్గాలకు ప్రదాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైసీపీదే నంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

"""/" / ఆ మద్య కులగణన చేపడుతున్నట్లు వైసీపీ ( YCP ) వాళ్లే క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు పదే పదే కులాల ప్రస్తావన జగన్ తీసుకొస్తున్నారు.దీని వెనుక ఉన్న వ్యూహామెంటి అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.

ఏ పార్టీకైనా గెలుపోటములను డిసైడ్ చేయడంలో కుల సమీకరణలు ప్రధానపాత్ర వహిస్తాయి.అందుకే ఈసారి 175 స్థానాల్లో విజయం సాధించాలంటే అన్నీ కులాల వారిని, వర్గాల వారిని ఆకర్షించాల్సి ఉంటుంది.

అందుకే ప్రత్యర్థి పార్టీ కుల వివక్ష చూపుతుందని చిత్రీకరిస్తూ. """/" / తమ పార్టీ ఆన్నికులాలకు ప్రదాన్యం కల్పిస్తోందని ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఇక సీట్ల కేటాయింపులో కూడా కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపు జరిపే అవకాశం లేకపోలేదు.

అయితే పదే పదే జగన్ గాని వైసీపీ వాళ్ళు గాని కులాల ప్రస్తావన తీసుకురావడం వల్ల ఇతరత్రా కులాల నుంచి ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందనేది, అదే కుల చిచ్చుగా మారిన ఆశ్చర్యపోఃనవసరం లేదనేది కొందరి అభిప్రాయం.

How Modern Technology Shapes The IGaming Experience