బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ? 

మరో నాలుగు రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది.

టీడీపీ, జనసేన,బీజేపీ ( TDP, Jana Sena, BJP )కూటమిని ఎదుర్కొనేందుకు వైసిపి అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తోంది.

మూడు పార్టీల కూటమిపై విమర్శలు చేస్తూ.2019 నుంచి ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మళ్లీ జనాలకు అందాలంటే మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతోంది.

వైసిపి ఎన్నికల మేనిఫెస్టో ( YCP Election Manifesto )ను జనాల్లోకి తీసుకువెళ్తోంది.

అయితే టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టోను మించి ఉండడం, భారీగా సంక్షేమ పథకాలను ప్రకటించడం, పింఛన్లు, తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సాయం వంటి వాటిని భారీగా పెంచి మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

ఆ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకువెళ్తున్నారు.అలాగే సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించారు.

తమ మేనిఫెస్టోనే తమను అధికారంలోకి తీసుకువస్తుందని నమ్మకంతో టిడిపి కూటమి ఉంది.అయితే ఈ కూటమి హామీలపై వైసిపి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తోంది.

"""/" / జగన్ ప్రతి ప్రచార సభలోను తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.

టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని, గతంలో చంద్రబాబు( Chandrababu ) అధికారంలో ఉండగా ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని జగన్ ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు.

జగన్ మొదటి నుంచి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా మళ్లీ తమను అధికార పీఠంపై కూర్చోబెడతారనే నమ్మకంతో ఉన్నారు.

జగన్( Jagan ) పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ గత ఐదేళ్లుగా టిడిపి, జనసేన నేతలు విమర్శలు చేస్తూనే వస్తున్నారు.

చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ కంటే తాను మెరుగైన పథకాలు అందిస్తానంటూ చెబుతున్నారు.

అయితే దీనిని అవకాశంగా తీసుకుని వైసిపి జనాలకు అర్థమయ్యేలా కౌంటర్లు ఇస్తోంది. """/" / తన మేనిఫెస్టోలో జగన్ ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తున్న అమ్మఒడి, రైతు భరోసా పెన్షన్ లు దశలవారీగా పెంచడం వంటి హామీలు ఇచ్చారు.

అయితే చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలతో పాటుగా, జగన్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను పేర్లు మార్చి తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు.

దీనిపైన వైసిపి గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది.తాము అమలు చేసిన పథకాలపై మొన్నటి వరకు విమర్శలు చేసి ,ఇప్పుడు వాటిని పేర్లు మార్చి అమలు చేస్తామని చెబుతున్నారని,  చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఆయన పాలన లోటు బడ్జెట్ తోనే కొనసాగిందని గుర్తు చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం టిడిపి ప్రచారం చేస్తున్న ఎన్నికల మేనిఫెస్టో జనాల్లోకి వెళ్లలేదని, చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయరు అనే అభిప్రాయం జనాల్లోకి బాగా వెళ్ళిందని వైసిపి గుర్తించింది.

ఇదే తమకు బాగా కలిసి వస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు.తమ పాలనలో సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరు మళ్ళీ తమకే ఓటు వేసి గెలిపిస్తారని నమ్మకంతో జగన్ ఉన్నారు.

హర్రర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిన వరుణ్ తేజ్