జగన్ భయపడుతున్నారా ? బెంగళూరుకు ? మకాం  అందుకేనా ?

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో( AP Assembly Elections ) వైసిపి ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు లేకపోవడం , కేవలం ఎమ్మెల్యే హోదా లోనే జగన్ ఉండడంతో , ఆ స్థాయిలోనే సెక్యూరిటీ ని ప్రభుత్వం కుదించడంతో జగన్ సొంతంగా ప్రవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.

అలాగే ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తన మాత్రం బెంగళూరుకు ( Bangalore )మార్చారు.

  హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ కు నివాసం ఉంది .

"""/" / అలాగే తాడేపల్లి( Tadepalli ) లోనూ సొంత నివాసం ఉంది.

అయినా జగన్ మాత్రం పదేళ్ల తరువాత బెంగళూరులోని తన ప్యాలస్ కి మకాం మార్చారు.

దీంతో జగన్ బెంగళూరుకు వెళ్లడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఎవరికి అంతుపట్టడం లేదు.

తనకు బెంగళూరులో ఉండడమే సురక్షితమని జగన్ నమ్ముతున్నారట.హైదరాబాద్ అయిన తాడేపల్లి ఆయనా తనకు సురక్షితం కాదని జగన్ భావిస్తున్నారట.

  అందుకే ఏదైనా పని ఉన్నప్పుడే తాడేపల్లికి వచ్చి మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోతున్నారు.

ఫ్యామిలీతో సహా అక్కడే ఉంటున్నారు.దీంతో పార్టీ పరంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఎన్నికల్లో వైసిపి( YCP ) ఓటమి చెందడం,  కొత్తగా టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో , జగన్ సెక్యూరిటీని బాగా తగ్గించారు .

అంతేకాదు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లే దారిని కూడా ఓపెన్ చేశారు.  దీంతో ప్రైవేట్ సెక్యూరిటీని జగన్ ఏర్పాటు చేసుకున్నారు.

తనపై దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతోనే ముందస్తుగా జాగ్రత్తలు జగన్ తీసుకుంటున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

"""/" / తనను అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతోనే బెంగళూరు సురక్షిత ప్రాంతంగా జగన్ భావించి అక్కడికి మకాం మార్చినట్లుగా పార్టీలోని కీలక వ్యక్తులకు కొంతమంది చెబుతున్నారు.

  అలాగే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్నా.ఇదే రకమైన ఇబ్బందులు ఉంటాయని,  తన ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు.

దీంతోపాటు లోటస్ పాండ్ లో( Lotus Pond ) తన చెల్లెలు,  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఉండడం కొంత ఇబ్బందికరంగా జగన్ భావిస్తున్నారట.

అందుకే అటు లోటస్ పాండ్ , ఇటు తాడేపల్లి నివాసం కాకుండా బెంగళూరు ప్యాలస్ లో ఉండేందుకే జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట.

అక్కడైతే ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని , తాడేపల్లిలో ఉంటే పార్టీ నాయకులు,  కార్యకర్తలు తాకిడి ఎక్కువగా ఉంటుందని,  కార్యకర్తల ముసుగులో తనపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని భావించి ఏపీకి దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల జగన్ తనకు ప్రాణహాని ఉందని తనకు సెక్యూరిటీ పెంచాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ సీరం ఇది.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!