జబర్దస్త్ కొత్త యాంకర్ అనాధనా? ఆమెకు ఎవరూ లేరా?

ఎవరి వ్యక్తిగత విషయంలోనైనా ఏదో ఒక చేదు అనుభవాలు ఉండే ఉంటాయి.ఎంత మంచి లైఫ్ లో జీవిస్తున్న కూడా వాళ్ల జీవితంలో ఏదో ఒక బాధ మిగిలే ఉంటుంది.

అయితే కొందరు ఈ విషయాలను బయట పెడుతుంటారు.మరికొందరు లోలోపల దాచిపెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు.

చాలామంది సామాన్యులు అనుకుంటుంటారు.సిని ఇండస్ట్రీకి చెందిన వాళ్ళ లైఫ్ లు బాగుంటాయని.

వాళ్లకు ఎటువంటి కష్టాలు.ఎప్పుడు నవ్వుతూ, లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అనుకుంటారు.

కానీ వారి జీవితంలో కూడా కొన్ని బాధలు ఉంటాయి.ఇక వాటిని సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయట పెడుతూ ఉంటారు.

అలా తాజాగా జబర్దస్త్ కొత్త యాంకర్ కు కూడా సందర్భం రావటంతో తన బాధ పడుతున్న విషయాన్ని బయటకి తెలిపింది.

బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

గత 9 ఏళ్ల నుండి ఈ షో ఈటీవీలో ప్రసారం అవుతూ మంచి ఆదరణతో దూసుకెళ్తుంది.

అంతేకాకుండా ఎంతోమంది కమెడియన్స్ కు ఈ షో లైఫ్ ఇచ్చింది.వారికి వెండితెరపై కూడా అవకాశాలు కల్పించింది.

చాలామంది కమెడియన్స్ ఇందులో పాల్గొని మంచి హోదాలో జీవిస్తున్నారు. """/"/ అయితే ఇందులో యాంకర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం.

ఎందుకంటే యాంకర్ లుగా ఇందులో తమ జీవితాన్ని ప్రారంభించిన రష్మీ, అనసూయలు మంచి క్రేజీ సంపాదించుకున్నారు.

ఇక అనసూయ ఈ షో నుండి దూరమైన సంగతి తెలిసిందే.అనసూయ, రష్మీ లు షోలో ఎంత సందడి చేశారో చూసాం.

అయితే వీరి కంటే పెట్టింపు సందడి చేస్తుంది కొత్త యాంకర్ సౌమ్యరావు.ఇటీవలే సౌమ్యరావు జబర్దస్త్ కొత్త యాంకర్ గా పరిచయం అయింది.

తన అందంతో అందరిని తన వైపుకు మలుపుకుంది.వచ్చిరాని తెలుగు భాషతో అందరిని బాగా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా హైపర్ ఆది కి మాత్రం బాగా కౌంటర్లు వేస్తూ సందడి చేస్తుంది.

ఈ ముద్దుగుమ్మ ఇంతా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా తనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి.

"""/"/ అయితే తాజాగా ఓ షో లో భాగంగా ఈమెకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక అందులో యాంకర్ ప్రదీప్ తన గురించి కొన్ని విషయాలు బయట పెట్టమని అడగటంతో.

వెంటనే తాను స్పందించింది.తాను ఒక అనాధ అంటూ.

తన లైఫ్ గురించి చెప్పను అని.తనకు అమ్మ లేదు అంటూ అందరి గుండె బరువెక్కించింది.

ఇక తనకు తండ్రి ఉన్నా కూడా లేడు అని.మొత్తం తను ఒక అనాధ అంటూ.

ఎవరు లేరు అంటూ.ఇక్కడున్న వారందరిలో అమ్మనో, నాన్ననో, బ్రదరో, సిస్టరో ఎవరో ఒక్కరైనా ఉంటారు.

కానీ తనకు ఎవరూ లేరు అంటూ.ఇటువంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను అని ఎమోషనలై అందర్నీ ఎమోషనల్ చేసింది.

ప్రస్తుతం ఈమె చెప్పిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?