వారితో పెట్టుకుంటే జ‌గ‌న్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడైనా స‌రే ఏ విష‌యాన్ని తెగే దాకా లాగొద్దు.ఇలా చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది.

ఏ వ‌ర్గంతో అయినా స‌రే వీలైనంత వ‌ర‌కు చ‌ర్చ‌ల‌తోనే స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవాలి త‌ప్ప గోటితో పోయేదాన్ని గొడ్డ‌లి దాకా లాక్కోవ‌ద్దు.

ఇదే విష‌యం ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి బాగా వ‌ర్తిస్తుంది.ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి కొన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి.

వాటిని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాలి త‌ప్ప పంచాయితీ పెట్టుకుంటే మాత్రం ప్రభుత్వానికే ఎసరు తెచ్చుకున్న‌ట్టు అవుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇంత‌కు ఏ విష‌యంలో అనుకుంటున్నారా.అదేనండి ఉద్యోగుల విష‌యం.

జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత ఉద్యోగుల సమస్యలను ప‌క్క‌న పెట్టేశార‌ని, త‌మ‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

జగన్ అధికారంలోకి రాక‌ముందు పీఆర్సీ ఇస్తామ‌ని, ప్రమోషన్లు, ఖాళీలు భర్తీ లాంటివి వెంట‌నే చేసేస్తానంటూ హామీలు గుప్పించారు.

వాటితో పాటు డీఏ, హెచ్ఆర్ఏ కూడా పెంచేస్తామ‌ని, అన్ని ర‌కాలుగా ఆదుకుంటామ‌ని చెప్పారు.

అయితే జ‌గ‌న్ సీఎం అయి స‌గం పాల‌న గ‌డిచిపోయినా ఈ విష‌యాల్లో మాత్రం ముంద‌డుగు ప‌డ‌ట్లేదు.

"""/" / దీంతో వారు తీవ్ర ఆవేద‌నను వ్య‌క్తం చేస్తున్నారు.త‌మ‌ను అస్స‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం ‌తో మండిప‌డుతున్నారు.

ఉద్యోగ సంఘాలు మొద‌ట‌గా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో భేటీ అయినప్ప‌టికీ వారి స‌మ‌స్య‌ల మీద స్ప‌ష్ట‌మైన హామీ రాలేద‌ని, వారు 7నుంచి సమ్మెలోకి వెళ్లిపోతున్నట్లు ప్ర‌క‌టించారు.

ఇదే ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.పీఆర్సీ నివేదిక చూపించ‌క‌పోవ‌డ‌మే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది.

సీఎం జ‌గ‌న్ త‌మ‌తో చ‌ర్చ‌లు జ‌రిపితే త‌మ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని భావిస్తున్నారు వారంతా కూడా.

కానీ జ‌గ‌న్ మాత్రం ఇందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ట్లేద‌ని తెలుస్తోంది.ఈ ధోర‌ణి చివ‌ర‌కు జ‌గ‌న్ కు ప్ర‌మాదంగా మారుతుంద‌ని చెబుతున్నారు.

నిరాడంబరంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..జెండా ఆవిష్కరించిన కేటీఆర్