మహిళల ఐపీఎల్‌ వేలంకి ముహూర్తం అప్పుడేనా..?

త్వరలో జరగబోయే మహిళల ఐపీఎల్ కు సంబంధించిన ఆటగాళ్ల వేలానికి ముహూర్తం ఖరారు అయినట్లు కనబడుతోంది.

మొదటగా ఈ వేళాన్ని ఫిబ్రవరి మాసం మొదటి వారంలో జరగాల్సి ఉండగా అది కాస్త ఫిబ్రవరి 11, 13 వ తారీకులలో నిర్వహించేందుకు బిసిసిఐ తన ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు సమాచారం.

ఇకపోతే మహిళ ఐపీఎల్ జట్లైన మొత్తం ఐదుకు గాను నాలుగింటిని ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో ఉన్న జట్లకు సంబంధించిన యాజమాన్యాలు కావడం వల్ల వారి షెడ్యూల్ బిజీగా కావడంతో తేదీల మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

"""/"/ ఈ కారణంగా ఇంటర్నేషనల్ టి20 లీగ్ ముగిసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బిసిసిఐ ని ఆయా జట్ల యాజమాన్యులు అడిగినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై అతి త్వరలో అధికారిక విషయం తెలవనుంది.ఈ కార్యక్రమం ముంబై లేదా ఢిల్లీ మహా నగరాలలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

మహిళల ఐపీఎల్ మార్చి 4 నుండి 24 మధ్యలో నిర్వహించబోతున్నట్లు బిసిసిఐ భావిస్తోంది.

"""/"/ ఇక జట్ల వివరాల్లోకి వెళితే.అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యాలు వారి జట్లను రంగం లోకి దింపనున్నాయి.

ఇకపోతే తాజాగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ భారతదేశ జట్టు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

బార్లీతో అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్‌..!