కన్నతండ్రిని చంపింది కొడుకేనా?

సూర్యాపేట జిల్లా:ఏనుబాముల గ్రామంలో అర్ధరాత్రి హత్య.ఒక్కసారిగా ఉలిక్కిపడిన గ్రామం.

కుటుంబ ఆస్తి తగాదాలే హత్యకు కారణమని భావిస్తున్న స్థానికులు.కొడుకు పైనే అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.

ఘటన తర్వాత కొడుకు ఇంట్లో లేకుండా పోవడంతో అనుమానాలకు చేకూరుతున్న బలం.ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు షురూ చేసిన పోలీసులు.

ఆత్మకూర్ (ఎస్) మండలం మండలం ఏనుబాముల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన వత్సవాయి మల్లయ్య(53) బుధవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన గ్రామంలో కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మల్లయ్య హత్యకు కుటుంబ భూ తగాదాలే కారణమని,కన్న కొడుకే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

మల్లయ్య హత్య జరిగిన తర్వాత కొడుకు గ్రామంలో కనిపించకుండా పోవడం అనుమానాలకు బలం చేకూరుతుంది.

వివరాల్లోకి వెళితే ఏనుబాముల గ్రామానికి చెందిన వత్సవాయి మల్లయ్యకు ఇద్దరు భార్యలు.చాల కాలం క్రితమే మొదటి భార్య మృతి చెందగా రెండో పెళ్లి చేసుకున్నాడు.

రెండో భార్య కూడా ప్రస్తుతం మల్లయ్యకు దూరంగా ఉంటుంది.మల్లయ్య పేరుమీద మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

ఇటీవల మొదటి భార్య కొడుకుకు,మల్లయ్యకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో రెండో భార్య కొడుకు తరుచుగా తండ్రి దగ్గరకు వస్తుండటం,ఆస్తిలో అతనికి కూడా తండ్రి వాటా ఇస్తాడనే అనుమానంతో మొదటి భార్య కొడుకే మల్లయ్యను చంపి ఉండవచ్చని భావిస్తున్నారు.

వెన్ను నొప్పికి కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను ఎలా వ‌దిలించుకోవాలి..?