ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడి కాయ తింటే ఏం అవుతుందో తెలుసా?
TeluguStop.com
అమ్మ కావాలని పెళ్లైన ప్రతి మహిళ ఎంతగా ఆరాటపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అలాంటి మహిళ గర్భం దాల్చగానే పడే ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక అప్పటి నుంచి కడుపులోని బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది.ఎన్నో కలలు కంటుంది.
ఇక గర్భణీ మహిళలు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
అప్పుడే కడుపులోని శిశువు ఆరోగ్యంగా, అందంగా పుడతారు.అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడి కాయ తినొచ్చా అన్నది చాలా మందికి ఉన్న సందేహం.
వాస్తవానికి గుమ్మడి కాయలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి.ఎన్నో జబ్బులను నియంత్రించే శక్తి కూడా గుమ్మడి కాయకు ఉంది.
ఇక గుమ్మడి కాయ ప్రెగ్నెన్సీ మహిళలు కూడా ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.
ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండే గుమ్మడికాయను ప్రెగ్నెన్సీ మహిళలు తీసుకోవడం వల్ల.
జీర్ణ శక్తి పెరగడమే కాదు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఈ కరోనా సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలు ఇమ్యునిటి పవర్ పెంచుకోవడం ఎంతో అవసరం.
అయితే గుమ్మడి కాయలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది.కాబట్టి, ప్రెగ్నెన్సీ స్త్రీలు గుమ్మడి కాయను ఏదో ఒక రూపంలో తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇక గర్భంతో ఉన్నప్పుడు కడుపు తిమ్మిరి తిమ్మిరిగా ఉంటుంది.అయితే గుమ్మడి కాయ తీసుకోవడం వల్ల అందులో ఉండే కొన్ని పోషకాలు కడుపు తిమ్మిరిని తగ్గిస్తాయి.
అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఫోలేట్, ఇనుము, కాల్షియం వంటి పోషకాలు ఉండే గుమ్మడి కాయను తీసుకోవడం వల్ల తల్లి మరియు కడుపులోని శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడి కాయను తీసుకోవడం వల్ల తరచూ వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
అదేవిధంగా, ప్రెగ్నెన్సీ సమయంలో గుమ్మడి కాయను తీసుకుంటే.బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉండడంతో పాటు రక్తపోటు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
ఐఫోన్ వాడుతున్నారా.. మీరు మోసపోతున్నట్లే.. షాకింగ్ నిజం బయటపెట్టిన మహిళ!