చిరంజీవి సినిమాకి చుక్కలు చూపించిన రవితేజ సినిమా అదేనా..? ఇది మామూలు ట్రాక్ రికార్డు కాదు!

ఒక్కోసారి బాక్స్ ఆఫీస్ పోటీ లో చిన్న హీరో సినిమా మరియు పెద్ద హీరో సినిమా నిలబడడం, పెద్ద హీరో సినిమా పై చిన్న హీరో సినిమా విజయం సాధించడం, ఇలాంటివన్నీ చాలానే చూసాము.

అలా అప్పట్లో అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతూ వస్తున్న మాస్ మహారాజా రవితేజ, మెగాస్టార్ చిరంజీవి( Ravi Teja, Megastar Chiranjeevi ) లాంటి దిగ్గజం హీరో గా నటించిన సినిమాకి పోటీగా నిలబడి, చిరంజీవి సినిమాని సైతం ఓడించడం అనే అరుదైన సంఘటన జరిగింది.

విషయం లోకి వెళ్తే ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Director Boyapati Srinu ) ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ, మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన చిత్రం 'భద్ర'( Bhadra ).

బోయపాటి శ్రీను కెరీర్ లో మీ అందరికీ బాగా ఇష్టమైన సినిమా ఏమిటి అని అడిగితే, అధిక శాతం మంది జనాలు ఇప్పటికీ భద్ర సినిమాకే ఓటు వేస్తారు.

అంత గొప్ప క్లాసిక్ చిత్రం ఇది. """/" / వాస్తవానికి ఈ సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెయ్యాలి, కానీ అప్పటికే ఆయన కాల్ షీట్స్ మొత్తం వేరే సినిమాకి కమిట్ అయిపోయి ఉండడం తో, స్వయంగా ఆయనే బోయపాటి శ్రీను ని తన కార్ లో ఎక్కించుకొని, దిల్ రాజు కి పరిచయం చేయించి ఈ సినిమాని ఆయన బ్యానర్ లో రవితేజ ని హీరో గా పెట్టి తెరకెక్కించేలా ప్లాన్ చేసాడు.

ఈ చిత్రం ఆరోజుల్లోనే 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా విడుదలైన సరిగ్గా నెల సమయానికి మెగాస్టార్ చిరంజీవి మరియు శ్రీను వైట్ల లో కాంబినేషన్ లో తెరకెక్కిన 'అందరి వాడు'( Andarivadu ) అనే సినిమా కూడా విడుదల అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా ఇది.ఈ చిత్రానికి ముందు ఇంద్ర, ఠాగూర్ మరియు శంకర్ దాదా MBBS వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి ఆయన కెరీర్లో.

"""/" / అలాంటి పీక్ టైం లో వచ్చిన ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు, కామెడీ పరంగా ఈ చిత్రం ఒక సెక్షన్ ఆడియన్స్ ని బాగానే అలరించింది కానీ, చిరంజీవి రేంజ్ కి తగ్గ సినిమా కాదు అనిపించడంతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది.

బాక్స్ ఆఫీస్ పరంగా ఈ చిత్రాన్ని యావరేజి అని చెప్పొచ్చు.కానీ మెగాస్టార్ స్టామినా వల్ల ఈ సినిమా ఆరోజుల్లో 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించాయి.

టాక్ లేకపోవడం తో రవితేజ 'భద్ర' చిత్రానికి వసూళ్లు ఆగలేదు.భద్ర చిత్రం వంద రోజులు ఆడగా, చిరంజీవి 'అందరివాడు' చిత్రం కేవలం 50 రోజులతోనే సరిపెట్టుకుంది.

అయితే అప్పటి మెగాస్టార్ ఇమేజి కి తగ్గ సినిమా కాదు కాబట్టి కమర్షియల్ గా అనుకున్న రేంజ్ కి వెళ్ళలేదు కానీ, ఇప్పటి ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని చూసి బాగా ఎంజాయ్ చేస్టున్నారు అనే చెప్పాలి.

బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ భారీ పోటీ ఇస్తుందా..?ఇక అందులో నలుగురి స్టార్ హీరోల పాత్ర ఉందా..?