తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్ వల్లే సాధ్యం అవుతుందా..?

పాన్ ఇండియా ఇండస్ట్రీలో తెలుగు హీరోలే ఎక్కువగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక సౌత్ లో తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలు ఉన్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వాళ్ళ సినిమాలు ఈ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాయి.

ఇక ముఖ్యంగా ఈ విషయం లో తమిళ్ సినిమా హీరోలైతే చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి.

మన హీరోలు మాత్రమే అక్కడ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన కథల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ మన నటులు కూడా అంతే ఇంటెన్స్ తో నటించి వారిని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక వీళ్ళు ఎక్కువ యాక్షన్ సినిమాలు చేస్తుంటారు. """/" / కాబట్టి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వాళ్లకు విపరీతంగా నచ్చుతున్నాయి.

ఫైనల్ గా మన సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.ఇక ఇప్పుడు ఇండియాలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) టాప్ లెవెల్లో ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

ఇక రాబోయే సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని అందుకుంటే ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.

ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

"""/" / ఇక అందులో భాగంగా ఎన్టీఆర్ దేవర, ( Devara ) అల్లు అర్జున్ పుష్ప 2,( Pushpa 2 ) పవన్ కళ్యాణ్ ఓజి,( OG ) రామ్ చరణ్ గేమ్ చేంజర్( Game Changer ) లాంటి సినిమాలు భారీ సక్సెస్ లను అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక వీళ్ల సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ ను చేపట్టినప్పటికీ ఈ సినిమాల మీద బాలీవుడ్ ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి.

వాళ్ళు ఈ సినిమాల కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలు ఎప్పుడ్ వచ్చిన కూడా సూపర్ హిట్ అవ్వడం మాత్రం పక్క.

జానీ మాస్టర్ కు మరో షాకింగ్ న్యూస్.. బెయిల్ రద్దు చేయాలంటూ?