ఢిల్లీ దొరల పెత్తనం అవసరమా.?: మంత్రి కేటీఆర్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కథలాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.ప్రజలు ఆలోచించి ఓటు వేయకపోతే మళ్లీ పాత రోజులే వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
నీళ్లు, కరెంట్, ఉద్యోగాల కోసం మళ్లీ ఆందోళనలు చేయాలని చెప్పారు.కాంగ్రెస్,బీజేపీ చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ చేసి చూపిందని తెలిపారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మొద్దన్న కేటీఆర్ కాంగ్రెస్ గెలిస్తే పాలన అంతా ఢిల్లీ నుంచేనని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మనపై ఢిల్లీ దొరల పెత్తనం అవసరమా అని ప్రశ్నించారు.
కెనడాలో సిక్కు గార్డు పంచ్ పవర్.. ఒక్క గుద్దుతో దుండగుడు ఖతం.. వీడియో వైరల్!