బి‌ఆర్‌ఎస్ కు గడ్డుకాలమేనా ?

మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బి‌ఆర్‌ఎస్ కు ప్రస్తుతం ప్రతికూల పవనాలే విస్తున్నాయి.

బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ( BJP ,Congress Party )లు కే‌సి‌ఆర్ టార్గెట్ గా ముప్పెట విమర్శలు గుప్పిస్తుండడం.

వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో బి‌ఆర్‌ఎస్ నేతలు కొంత వెనకబడడంతో బి‌ఆర్‌ఎస్ కు ఎన్నికల ముందు అనుకున్నంత మైలేజ్ రావడం లేదనేది కొందరి అభిప్రాయం.

పైగా బి‌ఆర్‌ఎస్ లోని చాలమంది నేతలు సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ కూడా కొంత బలహీన పడినట్లే కనిపిస్తోంది.

పైగా ప్రచారాలలో కూడా బి‌ఆర్‌ఎస్ తో పోల్చితే కాంగ్రెస్ జట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

"""/" / ఇదే దూకుడు హస్తం పార్టీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తే బి‌ఆర్‌ఎస్ కు గట్టి షాక్ తగులుతుందనేది కొందరి అభిప్రాయం.

ఇకపోతే సరిగ్గా ఎన్నికల ముందు రైతుబంధు పథకం( Rythu Bandhu ) ఆగిపోవడం కూడా ఒకింత బి‌ఆర్‌ఎస్ ను నష్ట పరిచే అంశమే.

రైతుబంధు పథకం ద్వారా విడుదలయ్యే నిధులు ఎంతో కొంత బి‌ఆర్‌ఎస్ కు మేలు చేస్తాయనే భావన ఆ పార్టీ నేతల్లో ఉండేది కానీ ఊహించని రీతిలో ఎలక్షన్ కమిషన్ రైతు బంధుకు బ్రేక్ వేయడంతో గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది.

"""/" / దింతో ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ మద్య రైతుబంధు చుట్టూ హాట్ హాట్ రాజకీయలు సాగుతున్నాయి, రైతుబంధు ఆపేందుకు కాంగ్రెస్ నేతలు రాసిన లేఖ కారణంగానే రైతుబంధు ఆగిపోయిందని, రైతులకు మేలు జరగడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు.

అయితే మంత్రి హరీష్ రావు( Harish Rao ) చేసిన వ్యాఖ్యల కారణంగానే రైతు బంధు ఆగిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు విడుదల చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

అయితే ఇందులో ఎవరి ప్రమేయం ఎంత మేర ఉన్నప్పటికి నష్టం మాత్రం బి‌ఆర్‌ఎస్ కే జరిగిందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.

మొత్తానికి ఎటు చూసిన బి‌ఆర్‌ఎస్ కు ప్రతికూలతే ఎదురవుతుండడంతో ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీకి గడ్డుకాలమేనా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

మరి ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంటుందో చూడాలి.

వీడియో వైరల్‌: దటీజ్ నీతా అంబానీ.. కన్యాదానం ప్రాముఖ్యత ఎమన్నా చెప్పిందా..