బరువు తగ్గడానికి అవిసె గింజలను ఇలా తీసుకోవడం మంచిదా..

ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని చాలామంది ప్రజలు అధిక బరువు తో బాధపడుతున్నారు.ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది యువతి, యువకులే కాకుండా ఎక్కువ వయసు ఉన్న పెద్దవారు కూడా ఉదయం, సాయంత్రం పూట జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.

అలాగే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు ఫిట్నెస్ గా ఉండడం కోసం వారు బరువు తగ్గితే వారికి ఒక సంవత్సరం బోనస్ ని ఉచితంగా ఇస్తామని ఆఫర్లు కూడా పెడుతున్నాయి.

చివరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి అధిక బరువు సమస్యను మనం తినే ఆహారం తోనే తగ్గించుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇలా బరువు తగ్గించుకోవాలనుకునే వారికి అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.అవిసె గింజలను మెత్తగా రుబ్బి తీసుకుంటే అవిసెల బయటి పొరను జీర్ణం చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

వీటిని తిన్నాకా వీటితోపాటు తగినంత నీటిని తాగడం మంచిది.ఎన్నో ప్రయోజనాలు కలిగిన అవెసలను తీసుకోవడం వల్ల వాటిలోని ఫైబర్ బరువు తగ్గడంపై కోసం ఎంతో ఉపయోగపడుతుంది.

ఊబకాయం అనేది మధుమేహం, గుండె సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఫ్లక్స్ సీడ్ సూపర్ ఫుడ్ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇవి ఫైబర్ సమృద్దిగా ఉండడంవల్ల ఆకలిని తగ్గిస్తుంది.

అధికంగా తినాలనే కోరికను తగ్గించి కేలరీలను తగ్గిస్తుంది. """/"/ పోషకాలుండే సూపర్ ఫుడ్,అవిసెగింజలలో ఒమేగా-3 చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి ఉండడంతో బరువు తగ్గడంపై వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వీటిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.అవిసె గింజలను ఎలా తీసుకోవాలంటే కప్పు నీటిలో ఒక టీస్పూన్ గ్రైండ్ చేసిన అవిసె పొడిని వేసి మరిగించి అందులో కాస్త తేనెను కలపాలి.

ఈ ద్రావకం కాస్త జిగురుగా ఉన్నా ఈ పొడితో చేసిన సూప్స్, స్మూతీస్, యోగర్డ్, చట్నీలు, లడ్డూలు లాంటివి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

జైలులో పశ్చాతాపపడుతున్న దర్శన్.. రేణుకాస్వామి ఫ్యామిలీకి అలా సాయం చేయనున్నారా?