చలికాలంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తినడం మంచిదా..

ప్రస్తుత కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత బాగా పెరిగిపోయింది.చలికాలంలో ఆరోగ్యమైన వ్యక్తులైన, అనారోగ్యమైన వ్యక్తులైన ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు.

ఈ చల్లని వాతావరణం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి కొన్ని పరిష్కారాల కోసం శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెంచుకోవడం మంచిది.

చలికాలంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు, దుంపలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని త్వరగా పెంచుకోవచ్చు.

ముఖ్యంగా చక్కెర వ్యాధి ఉన్నవారు అన్ని రకాల పండ్లను, కూరగాయలను తినడానికి వీలు కాదు.

ఈ వ్యాధి ఉన్నవారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడమే మంచిది.

చలికాలంలో సుష్మ పోషకాలకు చిరునామాగా భావించి పలు రకాల దుంపలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

ముల్లంగి ఆహారంలో ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.

ముల్లంగి తీసుకోవడం వల్ల శరీరంలో సహజమైన అడిపోనెక్టిన్ ఉత్పత్తిని కూడా పెంచే అవకాశం ఉంది.

ఇది ఇన్సులిన్ నిరోధకత నుంచి రక్షించే హార్మోన్.డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు బీట్రూట్ ను మంచి ఆహారంగా చాలామంది భావిస్తారు.

ఈ బీట్రూట్ ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నరాలు దెబ్బతినడం, కంటి చూపు మందగించడం వంటి డయాబెటిస్ సమస్యలు త్వరగా నియంత్రణలో ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే బీట్రూట్లో ఉండే ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఇన్సులిన్ సెన్సిటివిని పెంచడంలోను సహాయపడుతుంది. """/" / ఎర్ర ముల్లంగి కూడా షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

నీటి శాతం ఎర్ర ముల్లంగిలో ఎక్కువగా ఉంటుంది.ఇది రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచుతుంది.

అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే క్యారెట్ షుగర్ వ్యాధి ఉన్నవారికి ఎంతో మంచి ఆహారం.

ఇందులో ఉండే విటమిన్ ఏ, ఫైబర్ వంటివి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి.

టాలీవుడ్ స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించిన కల్కి.. ఇతర ఇండస్ట్రీలకు సైతం షాకిచ్చారుగా!