ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగిస్తే మంచిదా? దేవాలయంలో వెలిగిస్తే మంచిదా..?

కార్తీక మాసంలో( Karthika Masam ) దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని కచ్చితంగా చెప్పవచ్చు.

సాధారణంగా చెప్పాలంటే దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం ఒకటే అని పండితులు చెబుతున్నారు.

మామూలుగా ప్రమిద మట్టి తో చేసినదై ఉండాలి.ఎందుకంటే మన శరీరం పంచభూతాల తో తయారవుతుంది.

అలాగే దీపం( Deepam ) వెలిగించేటప్పుడు ఒక ఒత్తి తో దీపాన్ని వెలిగించరాదు.

ఇంకా చెప్పాలంటే నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం అని పెద్ద వారు చెబుతూ ఉంటారు.

ఉభయ సంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్య కారకం అని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

దీపారాధన సంధ్యా సమయంలోనే చేయాలి.అలాగే దీపారాధన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేయవచ్చు.

"""/" / ఇంకా చెప్పాలంటే ఆలయాలలో( Temples ) ఎప్పుడూ దీపం వెలిగించినా పుణ్యమే అని పండితులు చెబుతున్నారు.

అలాగే ఉద్యోగాలు చేసి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాళ్ళు అర్ధరాత్రి అయినా స్నానం చేసి దీపం వెలిగించడంలో తప్పు లేదు అని నిపుణులు చెబుతున్నారు.

ఒక వేళ స్నానం చేయకుండా దీపం వెలిగించాలనుకుంటే మాత్రం పూజ మందిరంలో( Pooja Mandir ) కాకుండా బయట వెలిగించాలని శాస్త్రాలను చెబుతున్నాయి.

అలాగే ఇంట్లో వెలిగించే దీపం కన్నా పూజా మందిరంలో వెలిగించే దీపానికి పుణ్య ఫలితం ఎక్కువ.

పూజ మందిరంలో వెలిగించే దిపం కన్నా దేవాలయంలో వెలిగించే దీపానికి మరో 10 రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

"""/" / అంతేకాకుండా దీపం వెలిగించడానికి కూడా కొన్ని పద్ధతులను కచ్చితంగా పాటించాలి.

ఎలా అంటే అలా అసలు చేయకూడదు.ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు.

అది పద్ధతి కాదు.ముందు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి.

అంతే కాకుండా వెండి కుందులు పంచలో కుందులు,ఇత్తడి కుందులతో దీపాలు వెలిగించాలి.కానీ స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు.

అలాగే కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

సుకుమార్ కూతురును మెచ్చుకున్న రామ్ చరణ్ దంపతులు.. అసలేం జరిగిందంటే?