శంకర్ ఇక రిటైర్మెంట్ అవ్వడం బెటరా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక రామ్ చరణ్ , గేమ్ చేంజర్ ( Ram Charan, Game Changer )సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఈ సినిమా మొదటి షో తోనే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా మీద పెద్దగా ఆశలైతే పెట్టుకోలేకపోతున్నారు.

ఇక సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

"""/" / ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో దర్శకుడు శంకర్ ( Director Shankar )తన ఏదైతే అనుకున్నాడో దాన్ని పూర్తిగా చూపించలేకపోయాడనే విమర్శలైతే ఎదుర్కొంటున్నాడు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కూడా ఆయన మరో డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే 'భారతీయుడు 2' సినిమాతో( Bharatiyadu 2 ) భారీగా దెబ్బతిన్న ఆయన ఈ సినిమాతో కూడా మరోసారి డిజాస్టర్ ను మూట గట్టుకోవడమే కాకుండా ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడి నమ్మకాన్ని వృధా చేశారనే చెప్పాలి.

మరి ఏది ఏమైనా కూడా శంకర్ మునుపటి లాగా సినిమాలను చేయడం లేదు.

మరి ఆయన రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. """/" / ఇక ఏది ఏమైనా కూడా ఆయన భారీ సినిమాలు చేయకుండా ఉంటే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు అతనికి సలహాలను కూడా ఇస్తున్నారు.

మరి ఇకమీదట ఆయనకు డేట్స్ ఇచ్చే హీరోలు కూడా లేరని తద్వారా ఆయన రిలాక్స్ అయితే బెటర్ అని కూడా చెబుతున్నారు.

చూడాలి మరి ఇక మీదట శంకర్ సినిమాలు చేస్తాడా లేదంటే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనేది ప్రస్తుతానికైతే ఆయన మీద భారీగా నెగెటివిటి ఉంది.