ఇది కుక్కా, తోడేలా.. ప్యారిస్‌లో ఈ పెంపుడు జంతువుని చూసి అందరూ షాక్..??

మనుషులు పుట్టిన కొంతకాలానికి జంతువులను పెంచుకోవడం ప్రారంభించారు.కుక్కలు, పిల్లులు, ఆవులు, మేకలు లేదా గొర్రెలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ వస్తున్నారు.

అయితే కాలం మారుతున్న కొద్దీ పెంపుడు జంతువులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా మార్పులు వస్తున్నాయి.

ఈరోజుల్లో కుందేళ్లు, కప్పలు, ఉడుములు వంటివాటిని కూడా పెంపుడు జంతువులు( Pet Animal )గా పెంచుకోవడం మొదలైంది.

కొంతమంది ఇళ్లలో సాలెపురుగులు, పాములు కూడా పెంచుకుంటున్నారు. """/" / ఇటీవల ప్యారిస్‌( Paris ) వీధుల్లో ఒక మహిళ తన పెంపుడు జంతువును వాకింగ్ చేయించింది.

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆమె పెంపుడు జంతువు చూడడానికి భయంకరంగా ఉంది.

ఆ జంతువుతో ఆమె నడుస్తుండటం వీడియోలో కనిపిస్తోంది.దానిని చూసిన వారంతా ఆమెతో ఎవరూ గొడవ పడరని కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి విచిత్రమైన జంతువుల వీడియోలు ట్విట్టర్‌లో తరచుగా పోస్ట్ అవుతుంటాయి.ఇలాంటిదే ఈ వీడియో కూడా.

వీడియోలో ఒక మహిళ తోడేలు( Wolf ) లాంటి జంతువుతో నడుస్తుంది.

వీడియో డిస్క్రిప్షన్‌లో "మీరు అనుకుంటున్నది కాదది" అని రాసి ఉంది. """/" / 14 సెకన్ల ఈ వీడియోలో ఒక మహిళ ఆ జంతువును గొలుసుతో కట్టి, దానిని తన వెంట తీసుకువెళుతున్నట్లు చూడవచ్చు.

ఆ తర్వాత ఆమె దుకాణాల దగ్గర కనిపిస్తుంది, కొన్ని వస్తువులు కొంటుంది.ఆ జంతువు ఆమెతో పాటు నడుస్తోంది, చాలా జాగ్రత్తగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది.

ఆ జంతువు బొచ్చుతో కూడిన జుట్టుతో, తోడేలులా కనిపిస్తుంది.అది నిజంగా తోడేలు అయి ఉంటుందా? అంటే ఖచ్చితంగా చెప్పలేం.

ఎందుకంటే తోడేలు లాగా కనిపించే కుక్కలు కూడా ఉన్నాయి.ఈ జాతి కుక్కలను చెకోస్లోవేకియన్ వోల్ఫ్‌డాగ్ అని పిలుస్తారు, అవి అచ్చం తోడేళ్ల లాగా కనిపిస్తాయి.

అవి చాలా ఎత్తుగా ఉంటాయి.మంచి పెంపుడు జంతువులుగా మెలుగుతాయి.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.ఈ వీడియోకు 2.

9 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనేక మంది యూజర్లు కామెంట్లలో స్పందించారు.

ఒక యూజర్ "ఇది ఒక నిజమైన కుక్క జాతి, చెకోస్లోవేకియన్ వోల్ఫ్‌డాగ్.ఇది తోడేలు లాగా కనిపించేలా ఉంటుంది, కానీ ఇది ఇంటి జంతువు.

" అని అన్నారు."ప్యారిస్‌లో ఆమెను దోపిడీ చేయలేరు, ఎందుకంటే ఆమె దగ్గర తోడేలు లాంటి కుక్క ఉంది.

" అని మరొక యూజర్ పేర్కొన్నాడు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?