ఇది బైకేనా.. లేకుంటే ట్యాక్సీనా.. ఇదేం క్రియేటివిటీ

మ‌న మెద‌డులో ఆలోచ‌న‌లు రావాలే గానీ.ఎలాంటి ఆవిష్క‌ర‌ణ‌లు అయినా చేసేయొచ్చు.

ఇందుకు ఎంతో మంది నిద‌ర్శ‌నంగా నిలిచారు.చాలామంది త‌మ తెలివి తేట‌ల‌తోనే ప్ర‌పంచాన్ని ఏలారు.

మారుమూల ప‌ల్లెల్లో నుంచి వ‌చ్చి ప్ర‌పంచానికి స‌రికొత్త మార్గం చూపించిన వారు అనేకం.

అలాంటి వారు ఎప్ప‌టికీ ట్రెండ్ సెట్ట‌ర్లుగానే నిలుస్తారు.అలాంటి వారికి స‌రైన స‌దుపాయాలు అందించాలే గానీ ప్ర‌పంచానికి కొత్త మార్గాలు చూపిస్తారు.

ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాంటి ఆవిష్క‌ర‌ణ‌తోనే మ‌నంద‌రి మ‌న‌సులు గెలిచేసుకున్నాడు.ఇందుకు సంబందిచిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

దాన్ని చూసిన వారంతా అత‌ని క్రియేటివిటీకి స‌లాం కొడుతున్నారు.సాధార‌ణంగా బైక్ అంటే ఇద్ద‌రు లేదా ముగ్గురు మాత్ర‌మే కూర్చోవ‌డానికి వీలుంటుంది.

మ‌రి 8 మంది సీటు మీద కూర్చోవాలంటే చాలా క‌ష్టం క‌దా.కానీ దీన్ని సాధ్యం చేసి చూపించాడు ఓ వ్య‌క్తి.

ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో ఓ వ్య‌క్తి త‌న బుల్లెట్ బైక్‌ను అటోలా మార్చాడు.

ఈ బైక్ మామూలు బైక్ ల కంటే కొంచెం పొడవు ఉంది.ఇక బైక్ పొడ‌వునా 10 అడుగుల పొడవైన సీట్‌ లాంటిది ఏర్పాటు చేశాడు.

"""/" / ఇలా పొడ‌వైన సీటు ఉండ‌టంతో అంద‌రూ దాని మీద కూర్చోవ‌డానికి వీలుగు అత‌ను ముందుకు జ‌రిగి ఉండ‌టంతో.

ఒక్కొక్క‌రుగా వ‌చ్చి ఆ బైకు మీద కూర్చుంటున్నారు.ఇలా ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు.

ఏకంగా ఎనిమిది మంది వ‌చ్చి ఆ బైకు మీద కూర్చోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయ‌గా.విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది.

ఇలాంటి క్రియేటివిటీ ఎక్క‌డి నుంచి వ‌స్తుందంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.ఇలాంటి క్రియేటివిటీ ఉండాలే గానీ.

ఎక్క‌డైనా బ‌తికేయొచ్చు అని చెబుతున్నారు.

వైసీపీదే అధికారమని చెబుతున్న మరో సర్వే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదా?