అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భవిష్యత్తులో పోటీ చేస్తానేమో : భారత సంతతి నేత రో ఖన్నా వ్యాఖ్యలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు( America ) వలస వెళ్లిన భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా రాజకీయాల్లో మనవారు దూసుకెళ్తున్నారు.గవర్నర్లు, సెనెటర్లు, చట్టసభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లుగా పలువురు భారతీయులు వున్నారు.

ఇప్పుడు ఏకంగా అమెరికాలోని రెండో అత్యున్నత పదవిలో స్వయంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్( Kamala Harris ) వుండటం మనందరికీ గర్వకారణం.

ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, కాంగ్రెస్ ఎన్నికలు జరనున్నాయి.ఎప్పటిలాగే పలువురు భారతీయులు, భారత సంతతి నేతలు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

"""/" / ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా( Ro Khanna ) భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ఆయన సహచరులు భావిస్తున్నారు.

రాజధాని వాషింగ్టన్‌లో గురువారం జరిగిన ‘ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ’( Indian American Impact ) చర్చా వేదికలో భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏబీసీ వార్తాసంస్థకు చెందిన విలేకరి జోహ్రీన్ షా .రో ఖన్నాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రశ్నించారు.

ఎలా చెప్పగలం.బహుశా వచ్చే పదేళ్లలో అధ్యక్ష పదవికి తాను పోటీ చేయవచ్చునేమోనంటూ రో ఖన్నా వ్యాఖ్యానించారు.

ఆయనకు తోడు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భారత సంతతి నేతలు శ్రీథానేదర్,( Shri Thanedar ) ప్రమీలా జయపాల్‌లు( Pramila Jayapal ) కూడా ఖన్నా పోటీపై సానుకూలంగానే స్పందించడం గమనార్హం.

"""/" / ఇదిలావుండగా.పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన హిందూ కుటుంబంలో జన్మించారు రో ఖన్నా.

ఆయన తండ్రి ఐఐటీ బాంబే, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో చదువుకోగా, తల్లి స్కూల్ టీచర్‌గా పనిచేశారు.

ఖన్నా తల్లి తరపు తాతగారు అమర్‌నాథ్ విద్యాలంకార్‌ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.

లాలాలజ్‌పత్ రాయ్‌తో కలిసి ఉద్యమాలు చేసి జైలు శిక్ష కూడా అనుభవించారు.ఇక రో ఖన్నా యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి ఆర్ట్స్, ఎకనామిక్స్, హానర్స్‌లో డిగ్రీ చేశారు.

డెమొక్రాటిక్ పార్టీకి గట్టి మద్ధతుదారైన రో ఖన్నాను 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు.

తర్వాత కాలిఫోర్నియా రాష్ట్రంలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రజాప్రతినిధుల సభకు వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు రో ఖన్నా.

జగన్ కు ఇదే అతిపెద్ద సవాల్ ! మారుతారో మార్చుతారో ?