చంద్రబాబుపై హీరో విశాల్ పోటీ నిజమేనా?

కోలీవుడ్ హీరో అయిన విశాల్‌ సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి.విశాల్ తెలుగు వాడే కావడంతో ఆయనకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు.

అయితే కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఇటీవల హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో తెగ హడావిడి జరుగుతోంది.

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విశాల్‌ను వైసీపీ రంగంలోకి దించుతోందని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో హీరో విశాల్ స్వయంగా స్పందించారు.ఏపీ రాజకీయాలపై తనకు అసలు ఆసక్తి లేదని విశాల్ కొట్టి పారేశారు.

అసలు ఈ ప్రచారం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో కూడా తనకు అర్ధం కావడం లేదని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తనను ఈ అంశంపై చాలా మంది అడుగుతున్నారని.అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని విశాల్ వివరించారు.

సినిమాలే తన జీవితం అని.చంద్రబాబుకు వ్యతిరేకంగా పోటీ చేసే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని విశాల్ క్లారిటీ ఇచ్చేశారు.

దీంతో కుప్పంలో విశాల్ పోటీ వార్తలకు తెరపడింది.కాగా 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

చంద్రబాబును ఓడించగల నేత కోసం ఆ పార్టీ వెతుకులాటను ప్రారంభించింది.ఈ నేపథ్యంలో వైసీపీ హీరో విశాల్‌ను రంగంలోకి దించుతోందని.

ఆయన రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన పోటీకి ఆసక్తి చూపుతున్నారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది.

విశాల్ తండ్రిది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కూడా కావడం ఈ ప్రచారానికి కారణమైంది.

"""/" / విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి.ఆయన సినీ నిర్మాత జీకే రెడ్డి కుమారుడు.

తమిళంలో చెల్లమే సినిమాతో 2004లో వెండితెరకు పరిచయం అయ్యారు.ఈ సినిమా తెలుగులో ప్రేమ చదరంగం పేరుతో విడుదలైంది.

2005లో విడుదలైన పందెంకోడి సినిమాతో తెలుగులో విశాల్‌కు మంచి పేరు వచ్చింది.అయితే తమిళంలోనే స్ధిరపడిపోయిన విశాల్ సినిమా రంగానికి చెందిన ఫెడరేషన్స్‌లో పోటీ చేసి గెలుస్తున్నారు.

ఇటీవల ఆయన తమిళ నటుల సంఘానికి జరిగిన ఎన్నికల్లో గెలిచి కీలక బాధ్యతలను చేపట్టారు.

దీంతో ఏపీ రాజకీయాల్లోకి విశాల్ వస్తున్నట్లు వైసీపీ సోషల్ మీడియా అభిమానులు ప్రచారం చేశారు.

తప్పించుకుంటూ అధికారులనే కారుతో ఢీకొట్టి .. భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు