లాస్య, రవి కలవడానికి కారణం అతడేనా..?!
TeluguStop.com
తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ లో రవి, లాస్య వారి కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
అప్పటిలో వీళ్లిద్దరు సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునారు.అనంతరం ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరు విడిపోవడం జరిగింది.
అప్పట్లో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు కూడా మనం వార్తలలో చూసాం.
ఇది ఇలా ఉండగా.లాస్య ఇటీవల స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచి తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
ఇక ఆమె అభిమానులు లాస్య కచ్చితంగా టాప్ 5 లో ఉంటుందని భావించరు కూడా.
కాకపోతే లాస్య 11వ వారమే హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యింది.అయితే తాజాగా రవి, లాస్య మళ్లీ జతకట్టి ఒక షో లో పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన ఒక ప్రోమోను కూడా ఇటీవల కాలంలో రవి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
ఈ ప్రోమో లో భాగంగా రవి, లాస్య కు "నిన్ను ఏ విషయంలో అయినా ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించు" అంటూ క్షమాపణలు కోరాడు.
అలాగే ఒకరినొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు.స్టార్ మా లో ఈ జోడి మళ్లీ సందడి చేయబోతున్నట్లు అర్థమవుతుంది.
ఇక ఈ ప్రోగ్రాం సంక్రాంతి పండుగ కానుకగా “ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ” అనే పేరుతో ప్రసారం అవ్వబోతున్నట్లు సమాచారం.
"""/"/
ఇక అసలు విషయంలోకి వస్తే.లాస్య, రవి ఇలా కలవడానికి బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కారణమని తెలుస్తుంది.
హౌస్ లో ఉన్నప్పుడు లాస్యను అభిజిత్ అక్క అంటూ బాగా కలిసి పోయేవాడు.
ఇది ఇలా ఉండగా రవి అభిజిత్ కు కజిన్ అవుతాడట.రవి లాస్య లను కలపడానికి అభిజిత్ తన వంతు సహాయం ప్రయత్నం చేశాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది.
సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఇండియన్-కెనడియన్ కపుల్.. ఎందుకంటే?