తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ?
TeluguStop.com
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)ని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారని, రేవంత్ రెడ్డి స్థానంలో మరో నేతకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది.
దీనికి తగ్గట్లుగానే రేవంత్ రెడ్డి సైతం తాను ముఖ్యమంత్రిగానూ ఇటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగాను ఉండడంవల్ల రెండు పదవులకు సరైన న్యాయం చేయలేదని, వేరొకరికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని అధిష్టానం పెద్దలకు చెబుతూనే వస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేయడంలో రేవంత్ రెడ్డి కీలకపాత్ర పోషించడం, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి అందరిని కలుపుకుపోయే విధంగా రేవంత్ వ్యవహరించిన తీరును చూసిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ స్టైల్ లోనే పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలిగిన వారికే ఆ బాధ్యతలను అప్పగించాలని చూస్తూ.
ఆ వ్యవహారం పైనే చాలా రోజులుగా దృష్టి సారించింది . """/" /
ఈ క్రమంలోనే ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud) ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అధికారికంగా ఈ ప్రకటన వెలువడనప్పటికీ ఆయన పేరు ఫైనల్ అయినట్లు సమాచారం.గడిచిన రెండు నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం విషయంపైనే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.
వివిధ సామాజిక కోణాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసింది.10 రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Bhatti Vikramarka Mallu) , మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఢిల్లీలో చర్చించిన రాహుల్ గాంధీ ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించారు.
"""/" /
బీసీల్లోను మహేష్ కుమార్ గౌడ్ తో పాటు, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అభ్యర్థిత్వాలపై చర్చ జరిగింది.
వీరి ఎంపిక బాధ్యతలను సోనియాగాంధీకి అప్పగించారట. ఆమె సూచనల మేరకు విద్యార్థి దశ నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ వైపే సోనియా మొగ్గు చూపించారట .
అధికారికంగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
మౌనం వీడిన కవిత : అదానికో న్యాయం.. ఆడ బిడ్డకో న్యాయమా ?