డాకు మహారాజ్ తర్వాత బాబీ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇప్పటికే బాలకృష్ణ( Balakrishna ) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు లాంటి నటుడితో బాబీ తన దైన రీతిలో సినిమాను చేసి డాకు మహారాజ్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి బాలయ్య అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి హీరోగా బాలయ్య అవతరించబోతున్నాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
"""/" /
ఇక బాబి( Bobby ) లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో ఈ సినిమాని తెరకెక్కించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తర్వాత బాబి ప్రభాస్ ( Prabhas )తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే ప్రభాస్ ని కలిసి ఆయనకు ఒక కథనైతే వినిపించారట. """/" /
కమర్షియల్ సినిమాలను తీస్తూ స్టార్ డైరెక్టర్ గా ముందుకు సాగిపోతున్న బాబీ ప్రభాస్ తో కూడా అలాంటి సినిమా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఈ కథకి ప్రభాస్ ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు.కానీ దాన్ని హోల్డ్ లో పెట్టారట.
ప్రభాస్ లైనప్ చాలా పెద్దగా ఉండటంతో బాబి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఉంది.
కానీ అది ఎప్పుడూ అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు.మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది సూపర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక మిర్చి సమయంలో ప్రభాస్ ఎలా ఉన్నాడో అలాంటి ఒక కథలో మరోసారి అతన్ని చూపించడానికి బాబీ సిద్ధం అవుతున్నాడనే చెప్పాలి.
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?