అప్పు చెల్లించాలి అన్నందుకు.. ఇంత దారుణం చేస్తారా?
TeluguStop.com
సాధారణంగా అప్పు ఇచ్చిన వారు ఎవరైనా తీసుకున్న వారిని ఎప్పుడు తిరిగి చెల్లిస్తారు? అని అడుగుతారు.
ఈ క్రమంలో తీసుకున్న వారు ఏదో ఒక సమయం చెప్పడమో లేదా డేట్ చెప్పడమో చేస్తుంటారు.
ఆ సమయానికి తప్పక చెల్లిస్తానని చెప్తుంటారు.అది పద్ధతి కూడా.
అయితే, మనం తెలుసుకోబోయే ఈ ఘటనలో అప్పు ఎప్పుడు చెల్లిస్తావ్? అని అడిగినందుకే ఓ వ్యక్తి డిఫరెంట్‌గా బిహేవ్ చేశాడు.
మహిళ అని కూడా చూడకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడు.ఇంతకీ సదరు వ్యక్తి ఏం చేశాడు? ఎక్కడ జరిగిందీ ఘటన? అనే వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు డిస్ట్రిక్ట్ సమీపంలోని మంగళగిరిలో ఈ దారుణ ఘటన జరిగింది.ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకుగాను అప్పు తీసుకున్న వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు.
వివరాల్లోకెళితే.విజయవాడ రాణిగారి తోటలో నివాసం ఉంటున్న ఓ మహిళ తాపీ మేస్త్రీగా పని చేసే చిర్రావురికి చెందిన గోపీ కృష్ణ అనే యువకుడికి మూడు లక్షల రూపాయల నగదు అప్పుగా ఇచ్చింది.
వడ్డీతో పాటు అసలు చెల్లిస్తానని గోపీ కృష్ణ చెప్పడంతోనే ఆమె డబ్బు ఇచ్చింది.
మహిళ, గోపీ కృష్ణకు మధ్య గతంలో పరిచయం ఉంది.అయితే, అప్పు తీసుకున్న తర్వాత గోపీ ఆమె ఉంటున్న ప్రాంతం వైపు వెళ్లడం లేదు.
ఈ నేపథ్యంలో సదరు మహిళ అప్పు తీర్చాలని కోరుతూ ఏకంగా చిర్రావురుకు వచ్చింది.
దాంతో గోపీ కృష్ణ ఓ ఆటోలో తీనను ఎక్కించుకుని కృష్ణ కరకట్ట వద్దకు తీసుకెళ్లాడు.
"""/" /
అక్కడకు వెళ్లాక ఏదైనా సమాధానం చెప్తాడేమో అని మహిళ భావించింది.
ఈ క్రమంలోనే మనీ ఎప్పుడు చెల్లిస్తావ్? అని సదరు మహిళ అడగగా, ఆమెతో వాగ్వాదానికి దిగాడు గోపీ.
మాటా మాటా పెరిగి ఆగ్రహానికి గురై కృష్ణ కాలితో ఎగిరి తన్నాడు.దాంతో సదరు మహిళ అక్కడికక్కడే కింద పడిపోయింది.
దీన్నంతటిని సదరు మహిళతో వచ్చిన మరో మహిళ వీడియో రూపంలో రికార్డు చేసింది.
దానిని పోలీసులకు చూపించింది.ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి వెళ్లి మహిళను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్26, గురువారం 2024