రాత్రి సమయంలో అధికంగా దాహం వేస్తుందా.. అయితే ఈ భయంకరమైన వ్యాధి లక్షణమా..!

రాత్రి సమయంలో మంచి నిద్రలో ఉన్నప్పుడు కొంత మందికి ఒక్క సారిగా దాహం వేస్తూ ఉంటుంది.

నీరు తాగాక కొద్దిసే పటికి మళ్ళీ దాహం వేస్తుంది.ఇలా తరచుగా జరుగుతూ ఉంటుంది.

దీంతో నిద్ర భంగం జరుగుతుంది.ఇలా జరిగితే అస్సలు తేలికగా తీసుకోవద్దు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే ఇది కొన్ని రకాల వ్యాధుల లక్షణంగా చెప్పవచ్చు.చాలా మంది ఎండా కాలం వేడి వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు.

కానీ ఆరోగ్యా నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.శరీరంలో షుగర్ ( Blood Sugar )ఎక్కువైతే శరీర వ్యవస్థ దానిని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.

దీని వల్ల మూత్రం ఎక్కువగా వచ్చి శరీరంలో నీటి కొరత ఏర్పడి తరచుగా దాహం వేస్తుంది.

బీపీ పెరిగినప్పుడు కూడా ఎక్కువగా చెమటపడుతుంది.దీంతో శరీరంలో నీటి కొడతా ఏర్పడుతుంది.

దీని కారణంగా అధిక దాహం వేస్తూ ఉంటుంది.దీనివల్ల రాత్రి సమయంలో నిద్ర భంగం జరుగుతుంది.

"""/" / మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లయితే ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం మంచిది.

రాత్రి సమయంలో దాహంగా అనిపించడం డీహైడ్రేషన్ సమస్యకు కారణం అవుతుంది.డిహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు లేకపోవడం దీనికోసం క్రమం తప్పకుండా నీరు తాగడం అవసరం.

రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని గుర్తించుకోవాలి.మధుమేహాన్ని( Diabetes ) అదుపులో ఉంచుకోవాలంటే వ్యాయామ దినచర్యాను పాటించాలి.

అలాగే రోజువారి డైట్ లో మార్పులు చేసుకోవాలి.ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి.

"""/" / ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వులను తక్కువగా తీసుకోవడమే మంచిది.బీపీని నియంత్రించుకోవడానికి సరైన జీవన శైలిని అవలంబించాలి.

ఇందుకోసం ఆహారంలో సోడియం తక్కువగా తీసుకొని ఊబకాయం( Obesity ) రాకుండా చూసుకోవడం ఎంతో మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే వెంటనే దానిని తగ్గించుకోవడం మంచిది.

ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు బీపీ చెక్ చేసుకోవాలి.

జై హనుమాన్ గురించి క్రేజీ అప్ డేట్స్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. అలా చెప్పడంతో?