సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ గా కమ్మిన్స్ సక్సెస్ అయినట్టేనా..?

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17 ( IPL Season 17 )చాలా గ్రాండ్ గా జరుగుతుంది.

అయితే ఈ సీజన్ లో ప్రతి ఒక్క టీం కూడా తమ తమ సత్తాను చాటుతూ ముందుకు కదులుతున్నారు.

సన్ రైజర్స్ ( Sunrisers )హైదరాబాద్ టీం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో గెలిచి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.

అయినా కూడా హైదరాబాద్ టీమ్ ఎక్కడ డీలా పడకుండా చెన్నై లాంటి ఒక బలమైన జట్టును ఓడించి తమ సత్తా ఏమిటో చూపించుకున్నారు.

"""/" / ఇదే విధంగా మిగిలిన మ్యాచ్ లను కూడా ఆడగలిగితే హైదరాబాద్ టీమ్ ఈసారి పక్కాగా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఈ మ్యాచ్ లో విజయం సాధించడమే హైదరాబాద్ టీం ( Hyderabad Team )కి భారీగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.

ఈ టీం లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా టచ్ లోకి రావడం ఈ టీమ్ ను ముందుండి నడిపించడంలో ఆ టీమ్ కు చాలా వరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి.

ఇక పాట్ కమీన్స్( Pat Cummins ) ని ఈ టీమ్ కి కెప్టెన్ గా చేయడం కూడా ఒక వంతుకు మంచి విషయం అని హైదరాబాద్ టీం అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే హైదరాబాద్ ఈసారి కప్పు కొట్టే విధంగానే ముందుకు సాగుతుంది.మరి ఇదే జోరును కనక మిగతా మ్యాచ్ ల్లో కొనసాగిస్తే ఈ టీమ్ కి తిరుగులేదనే చెప్పాలి.

"""/" / ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ ( Heinrich Klassen, Abhishek Sharma )లాంటి ప్లేయర్లు టీం ని ముందుండి నడిపించడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు.

2016వ సంవత్సరంలో డేవిడ్ వార్నర్ సారధ్యంలో సన్ రైజర్స్ టీం కఒకసారి కప్ అందుకుంది.

ఇక అప్పుడు ఎలాంటి జోష్ లో అయితే ముందుకు సాగిందో ఇప్పుడు కూడా అలాంటి జోషే కనిపిస్తుండడంతో ఈ టీమ్ మీద భారీ అంచనాలైతే నెలకొన్నాయి.

చూడాలి మరి ఈ టీం ఎంతవరకు సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది అనేది.

ఎట్టకేలకు పుష్ప సినిమాకు విష్ చేసిన మెగా హీరో.. బన్నీ రిప్లై ఇస్తాడా?