ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకబడిందా?

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు హీటెక్కుతోంది.ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.

ఎవరికి వారు ప్రభుత్వంపై తూటాలు ఎక్కుపెడుతూ తమకు మద్దతు పలికితే పట్టభద్రులకు న్యాయం చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుపుతున్నారు.

అయితే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాస్త వెనుక బడ్డట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఇంకా చల్లబడని నేపథ్యంలో అందరూ ఒకటై పట్టభద్రులకు గట్టి భరోసాను కాంగ్రెస్ నాయకులు ఇవ్వలేకపోతున్నారు.

తద్వారా కాంగ్రెస్ పై పట్టభద్రులకు విశ్వాసం సన్నగిల్లుతోంది.అయితే కలిసికట్టుగా ఏకస్వరంతో పట్టభద్రులకు ఉన్న ఈ సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించకపోవడం కొంత పట్టభద్రుల మనసు గెలుచుకోవడంలో విఫలమవుతున్నారు.

రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో నిర్వహించే సమావేశాలలో పట్టభద్రుల కంటే సామాన్య ప్రజలు ఆ సమావేశాలకు హాజరవుతున్నారు.

దానివల్ల కాంగ్రెస్ కు పెద్ద ఉపయోగం లేదు.కాంగ్రెస్ చేస్తున్న ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈసారి కూడా ఈ ఎన్నికల్లో వెనుకడుగు వేస్తే మరల కాంగ్రెస్ ను కఠిన పరిస్థితుల నుండి బయటపడవేయడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది.

ఏది ఏమైనా కాంగ్రెస్ తన మునుపటి లా సత్తా చాటడంలో ఎక్కడో లోపం కనిపిస్తోంది.

ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే బీజేపీ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

చూద్దాం కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎంతమేర సత్తా చాటుతుందనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు