అక్టోబర్ 2 వ తేదీన సీఎం జగన్ రాజీనామా చేయబోతున్నాడా..!
TeluguStop.com
అవును మీరు వింటున్నది నిజమే.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్( YS Jagan Mohan Reddy ) వచ్చే నెల 2 వ తారీఖున అసెంబ్లీ ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నాడని ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.
దీని కోసం చర్చలు జరిపేందుకు రేపు ఢిల్లీ కి వెళ్లబోతున్నాడు సీఎం జగన్.
ఆ తర్వాత అమరావతి కి వచ్చి కేబినెట్ తో మీటింగ్ జరిపి తుది నిర్ణయం తీసుకోబోతున్నాడు.
ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అనే దానిపై సోషల్ మీడియా లో ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి.
ఈ ముందస్తు ఎన్నికల గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి హెచ్చరిస్తూనే ఉన్నాడు.
సీఎం జగన్ అనేక మార్లు ఢిల్లీ కి రావడానికి కారణం అదే, అక్కడి నుండి నాకు అందిన సమాచారం డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయని పవన్ కళ్యాణ్ ముందు నుండే చెప్తూ ఉన్నాడు.
"""/" /
ఆయన చెప్పినట్టుగానే నేడు ముందస్తు ఎన్నికలకు ప్రణాళిక జరుగుతుంది.ఇదంతా పక్కన పెడితే ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు అంటే ప్రభుత్వానికే ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే చంద్ర బాబు నాయుడు ప్రస్తుతం అరెస్ట్ అయ్యి ఉన్నాడు.అతనిని 14 రోజుల పాటు రాజముండ్రి జైలు లో రిమాండ్ లో ఉంచి, ఆ తర్వాత నాన్ బైలబుల్ వారెంట్ ని జారీ చేసి, పదేళ్ల పాటు జైలు శిక్ష పడేలాగా ప్రభుత్వం పావులు కదుపుతోందని టాక్.
ఒకవేళ అదే జరిగితే తెలుగు దేశం పార్టీ కి గెలిచే అవకాశాలు తక్కువ.
వ్యూహాలు ప్రతివ్యూహాలు అన్నీ చంద్ర బాబు నాయుడు వేసేవాడు.ఆయన లేకపోతే ఇప్పుడు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుందని విశ్లేషకుల అంచనా.
జైలు నుండే రాజకీయాలు చెయ్యొచ్చు కానీ, అందుకు వైసీపీ ప్రభుత్వం ఎదో ఒక ఎత్తుగడ వెయ్యొచ్చు.
"""/" /
ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే, ఈ పార్టీ కి ఇంకా 175 స్థానాల్లో పోటీ చేసేంత బలం రాలేదు.
తెలుగు దేశం పార్టీ తో పొత్తు ఉంటుందని ఇదివరకే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అనేకసార్లు తెలిపాడు.
ఇప్పుడు చంద్ర బాబు నాయుడు జైలులో ఉంటే ఈ పొత్తు కార్యక్రమాలు ఎవరు చూసుకుంటారు.
?, లోకేష్( Nara Lokesh ) కి అంత సామర్థ్యం ఉందా? అనే సందేహాలు కార్యకర్తల్లో మెలుగుతున్నాయి.
ఒకవేళ తెలుగుదేశం పార్టీ లో ఉన్న ముఖ్య నాయకులంతా జనసేన పార్టీ వైపు వచ్చి బలంగా నిలబడి పోటీ చేస్తే ప్రభుత్వాన్ని స్థాపించే రేంజ్ కి జనసేన వెళ్తుందా.
?, లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో స్థిరపడుతుందా?, ముందు ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?, గెలుపు ఎవరిదీ, ఓటమి ఎవరిదీ అనేది తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే.
అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?