పవన్ మాటల్లో క్లారిటీ మిస్ అవుతోందా..? పార్టీ విషయంలో తనను తానే...!
TeluguStop.com
ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కో సభలో ఒక్కోలా మాట్లాడుతున్నారనే వాదన వినిపిస్తోంది.
ఇప్పటికీ పవన్ పార్టీపై క్లారిటీ లేకుండానే మాట్లాడుతున్నారని అంటున్నారు.పొత్తులపై ఒకసారి.
పోటీపై మరోసారి క్లారిటీ లేకుండానే మాట్లాడుతున్నారని అంటున్నారు.ఇక తాజాగా మాట్లాడిన మాటలతో పవన్ అయోమయంలో ఉన్నాడని అంటున్నారు.
పార్టీ ఐటీ విభాగం కార్యకర్తలతో మాట్లాడారు.అధికారం కోసమో.
లేకపోతే పదవుల కోసమో తాను పార్టీ పెట్టలేదని అన్నారు.తాను పార్టీ పెట్టింది ఒక తరాన్ని నిద్రలేపటానికట.
పార్టీపెట్టింది ఒక తరానికి బాధ్యతను గుర్తుచేయటానికని అంటున్నారు.ఆ స్థోమత ఉంటే ప్రజల కచ్చితంగా మనకు అవకాశం ఇస్తారన్నారు.
దీంతో పవన్ తనని తాను మోసం చేసుకుంటున్నారేమో అనే అనేమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
H3 Class=subheader-styleఒక్కోసారి ఒక్కోలా మాట్లాడటం./h3p
ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చింది.
పదవుల కోసం కాదు అధికారం కోసం కాదు.ప్రజలకు సేవచేయడానికి అని చెప్పారంటే.
అందుకు భిన్నంగా నే ఆలోచిస్తారు.ఎందుకంటే పదవులు వద్దంటే అధికారం అవసరం లేదని అనుకుంటే అసలు రాజకీయాల జోలికే రారు.
ఏదో స్వచ్ఛంద సంస్థలు పెట్టుకుని సేవ చేయాలని అనుకుంటారు.కానీ పవన్ మాటలు పరస్సర విరుద్ధంగా ఉంటున్నాయి.
ఒకసారేమో పదవులకోసం అధికారంకోసం రాజకీయాల్లోకి రాలేదంటారు.మరోసారి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారం జనసేనదే అంటారు.
వైజాగ్ లో మాట్లాడినపుడు తనను జనాలు రెండు నియోజకవర్గాల్లోనూ ఓడించారని బాధపడ్డారు. """/" /
ఇంకోసారి అధికారం లేకపోతే జనాలకు ఏమీ చేయలేమన్నారు.
దీన్ని బట్టి చూస్తే ఒక్కోసారి ఒక్కోమాట మాట్లాడుతున్న పవన్ పూర్తిగా అయోమయంలో ఉన్నారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇలా అయితే ప్రజలు ఏం ఆలోచిస్తారు.ఇలాగైతే పవన్ అధికారంలోకి వస్తాడా.
పోనీ అధికారం లేకుండానే ఎన్నాళ్లు ఇలా ప్రశ్నించి ఏం సాధిస్తారని.అంటున్నారు.
రాజకీయాల్లోకి తాను ఎందుకొచ్చాను అనే విషయంలో పవన్ కే క్లారిటీ లేనపుడు ఇక జనసేన విషయంలో జనాలకు మాత్రం క్లారిటీ ఉంటుందని అంటున్నారు.
జగన్, చంద్రబాబును చూసైనా పవన్ రాజకీయం నేర్చుకున్నట్లు లేదనిపిస్తోంది.వాళ్లిద్దరూ పక్తు రాజకీయాలే చేస్తుంటారు.
అధికారం కోసమే పదవుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు.వాళ్లే కాదు దేశంలో బడా బడా నేతల కాంక్షే అది.
అలాంటిది పవన్ అధికారం లేకుండా ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నారో మరి.
ఈ ఫిమేల్ స్టూడెంట్ తెలివి అదుర్స్.. ఏం చేసిందో చూడండి..