అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి కత్తి పట్టబోతున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం 70 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికి భారీ సినిమాలను చేయడానికి ఎప్పుడూ మందు వరుసలో ఉంటున్నాడు.
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
"""/" /
ఇక ఈ సినిమాలో ఒకప్పటి వింటేజ్ చిరంజీవిని మనం చూడబోతూన్నాం ఉంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే అభిమానులందరికి ఒక భరోసా అయితే ఇచ్చాడు.
మరి చిరంజీవి ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు తద్వారా ఈ సినిమా ఎలా ఉంటుంది ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికైతే అనిల్ రావిపూడి ఈ సినిమాలో చిరంజీవి చేత కత్తి పట్టించబోతున్నాడు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి.
అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అందరి అదృష్టమనే చెప్పాలి.
ఈయన వల్ల సినిమా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. """/" /
ఇప్పటివరకు ఆయన చేసిన ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి.
అలాంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం తన కల గా భావించిన ఆయన ఇప్పుడు ఎట్టకేలకు ఆయనతో సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఇకమీదట చేయబోయే సినిమాల మీద కూడా ఆయన భారీ ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అనిల్ రావిపూడి చేస్తున్న ప్రతి సినిమాకి ఒక గొప్ప గుర్తింపైతే ఉంటుంది.
రాజమౌళి తర్వాత అంత గొప్ప గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కూడా అనిల్ రావిపూడి గారే కావడం విశేషం.