చికోటి ప్రవీణ్ విజయసాయిరెడ్డి బీనామీయా?
TeluguStop.com
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో తాజాగా జంతువులతో ఉన్న చిత్రాలను షేర్ చేశారు.
ఈ ఫోటోలలో పాములతో సహా కొన్ని జంతువులతో ఆయన పోజులిచ్చాడు. “వివిధ జాతుల జంతువుల అద్భుతమైన అందాలను చూడడం నా ఒక రకమైన వినోద కార్యకలాపం! ఈరోజు శంషాబాద్ వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సమయం నుండి కొన్ని స్నిప్పెట్‌లను పంచుకుంటున్నాను" అంటూ ట్విట్ చేశారు.
ఇక పిక్స్ బయటకు వచ్చిన వెంటనే, నెటిజన్లు చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ జంతువులుగా గుర్తించారు.
గోవా క్యాసినో కేసులో చికోటి ప్రవీణ్‌ని ఇడి విచారిస్తున్న విషయం తెలిసిందే.విదేశాల్లో క్యాసినో నిర్వహించిన ప్రవిణ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించాడనే ED దాడులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
చికోటి ప్రవీణ్‌కి సంబంధించిన పూర్తి కాల్ డేటాను సేకరించిన ED, పలువురు వ్యక్తులను విచారిస్తోంది.
ఈ నేపథ్యంలో చీకోటి ఫామ్‌హౌస్‌కి సాయిరెడ్డి వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది.ఇటీవల, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చికోటి ప్రవీణ్ హాబీ అయిన ఈ ఫామ్ హౌస్‌లో పెంచే విభిన్న జంతువులను చూడటానికి ఫామ్‌హౌస్‌ని సందర్శించారు.
"""/"/
అయితే చీకోటి ప్రవీణ్‌కు సాయిరెడ్డికి ఏమైన సంబంధాలు ఉన్నాయా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయసాయి రెడ్దికి చీకోటి ప్రవీణ్‌కు బీనామీయా? అనే అనుమానాలు తలేత్తుతున్నాయి.రాజకీయ అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున సంపాదన పోగుచేయడం.
విలాసంతమైన ఫాం హౌస్ నిర్మించడం సాధ్యం కాదని.చీకోటి ప్రవీణ్‌కి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నయనే ఆరోపణలు గతంలో వచ్చినప్పటికీ ఇప్పడు విజయసాయి రెడ్డి పోటోలు బయటకు రావడంతో ఆ అనుమానాలు మరింతగా బయటపడ్డాయి.
వైరల్ వీడియో: మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?