టీఆర్ఎస్ ను హిందూవ్యతిరేక పార్టీగా చిత్రీకరించడమే బీజేపీ టార్గెట్టా?

తెలంగాణలో రోజురోజుకు బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది.తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విధంగా ప్రజల్లో భావనను కలిగిస్తోంది.

ఇంతవరకు తెలంగాణలో మతపరమైన రాజకీయ ప్రకటనలు కాని హిందూ మతం అని కాని దేవుళ్ళ పేరుతో రచ్చ అవడం లాంటివి జరిగిన సంఘటనలు అరుదు అని చెప్పవచ్చు.

అంతేకాక బీజేపీకి బలమైనటువంటి హిందుత్వ ఎజెండాను బలంగా తీసుకెళ్లడంలో బీజేపీకి మించిన వారు ఎవరూ లేరు.

ఇప్పుడు హిందుత్వ వ్యాప్తిని బలంగా తీసుకెళ్తున్న బీజేపీ, వారి కార్యాచరణకు అడ్డు వచ్చిన వారిని హిందుత్వ వ్యతిరేక ముద్ర వేయడం ఇది దేశ వ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం.

అచ్చం ఇలాగే తెలంగాణలో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితులలోఅయోధ్య రామ మందిర నిర్మాణ నిధుల సేకరణ కార్యక్రమాన్ని బీజేపీ నడిపిస్తోంది.

ఇప్పుడు ఈ వ్యవహారం నచ్చని కొంత మంది టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటే వారి వ్యాఖ్యలను హిందూ మతాన్ని కించపరుస్తున్నారని బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెల్తున్నారు.

ఇలా బీజేపీ ఇటువంటి కార్యం ఏది చేపట్టినా టీఆర్ఎస్ అడ్డుకుంటే హిందూ వ్యతిరేక ముద్ర వేసే అవకాశం ఉంది.

ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేశారా.. కొత్త ఆఫర్లు రావడం కష్టమేనా?