మహిళా బిల్లు పై బీజేపీ ప్లాన్ అదే ?

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మహిళా బిల్లు( Women's Bill ) కు సంబంధించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది.

చట్టసభల్లో మహిళలకు ప్రదాన్యత కల్పిస్తూ రిజర్వేసఃన్ బిల్లుకు ఆమోదం తెలపాలని ఈ మద్య డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కు ఆమోదం తెలిపింది.

అంతే కాకుండా ఇటీవల లోక్ సభలో కూడా ఆ బిల్లు కు ఆమోదం లభించింది ఇక రాజ్యసభలో ఆమోదం పొందడం లాంఛనమే.

అయితే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు అనూహ్యంగా తెరపైకి రావడం కేంద్ర ప్రభుత్వం కూడా వెనువెంటనే ఆమోదం తెలపడం వంటివి చూస్తే ఇందులో రాజకీయ లబ్ది ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది.

"""/" / అందుకే గత కొన్నాళ్లుగా బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితా ( BRS MLC Kavitha )ఈ బిల్లు పై పోరాటం చేస్తూ వవ్ఛింది.

అయితే మొదట ఈ బిల్లు ను ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ( Congress Party )దక్కుతుంది.

దాంతో వెంటనే ఆ పార్టీ అలెర్ట్ అయ్యి మహిళా బిల్లుపై స్పందించింది.ఇక రోజురోజుకు ఈ బిల్లుపై చర్చ పెద్దదౌతున్న నేపథ్యంలో బీజేపీ ఈ బిల్లు పై మాత్రం నిరాకరించిన ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

అందుకే అన్నీ పార్టీ లు బిల్లుకు సానుకూలంగా ఉండడం.అలాగే బిల్లుకు ఆమోదించిన ప్రభుత్వంగా నిలిచేందుకు మోడి సర్కార్ లోక్ సభలో( Modi Sarkar ) బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఈ బిల్లుకు ఆమోదం లభించిన చట్టంగా మార్చడంలో మాత్రం చిన్న మెలిక పెట్టింది మోడి సర్కార్.

"""/" / ఈ ఎన్నికల్లో ఈ బిల్లు అమల్లోకి రాదని 2024 ఎన్నికల తరువాత జన ఘనన పూర్తి చేసిన తరువాత ఇది చట్టంగా మారుతుందని స్పష్టం చేసింది.

దీంతో మహిళా బిల్లు పై మరో కన్ఫ్యూజన్ తెరపైకి వచ్చింది.వచ్చే 2024 ఎన్నికల్లో ఒకవేళ ప్రభుత్వం మారితే మళ్ళీ బిల్లు పెండింగ్ లో పడే అవకాశం ఉందా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరి కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా దాని ప్రకారం.బీజేపీ ఇప్పటికే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను రెడీ చేసుకుందని, ఈ టైమ్ లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే మళ్ళీ మార్పులు చేయాల్సి ఉంటుందని భావించి వ్యూహాత్మకంగా జన గణన పేరుతో బిల్లును చట్టంగా మార్చడాన్ని హోల్డ్ లో పెట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కెనడా – బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు.. అమెరికాలో ప్రవాస భారతీయుల ర్యాలీ